Sampath Nandi to direct Anasuya : సంపత్ నంది దర్శకత్వంలో అనసూయ :-

Sampath Nandi to direct Anasuya : సీటిమార్ తో మాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు సంపత్ నంది. సీటిమార్ సక్సెస్ ని చిత్ర బృందం తో ఎంజాయ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.
అయితే సంపత్ నంది అపుడే మరో సినిమా ప్లాన్ చేసారని , ఈసారి ఫిమేల్ ఓరియెంటెడ్ అని చిత్ర సీమ లో టాక్ నడుస్తుంది. అదేంటంటే సంపత్ నంది యాంకర్ అనసూయతో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ఫోటోషూట్ వర్క్ కూడా పూర్తయిందని సమాచారం.
అయితే ఈ సినిమాలో అనసూయ పాత్రా సమాజంలో ఉన్న ప్రతి మహిళా గర్వించేలా ఉంటుంది అని , సంపత్ నంది స్టోరీ నరేషన్ ఇచ్చినపుడే అనసూయ చేయాలనీ బలంగా ఫిక్స్ అయిందని టాక్.
అయితే అనసూయ ప్రస్తుతం పుష్ప మరియు చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ముఖ్య పాత్రలు చేస్తుంది. వీటి షూటింగ్ పూర్తయ్యాక పూర్తిగా సంపత్ నంది తో ట్రావెల్ అవ్వనుంది. చూడాలి మరి సంపత్ నంది అనసూయ తో ఎలాంటి ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేయబోతున్నారో అని.