Samantha: సమంతా బ్యాగ్ ఒకటి కొటేస్తే…చాలు..

Samantha: ఏం మాయ చేసావే అనే సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి…తన అంద చందాలను ప్రదర్శించి ప్రేక్షకులందరినీ తన మాయలో పడేసుకుంది ఈ ముద్దు గుమ్మా.

అక్కినేని నాగ చైతన్య ను వివాహం చేసుకున్న తర్వాత ఈ అమ్మడు కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ ఎంటర్టైన్మెంట్ ను ప్రేక్షకులకు అందించడంలో ఎలాంటి మార్పు రాలేదు. ఆహా ఓటీటీ నిర్మిస్తున్న “సామ్ జమ్” షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ… తనదైన శైలిలో ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ సమంత ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ షోలో మెగాస్టార్ చిరంజీవి హీరో అల్లు అర్జున్ నిర్మాత అల్లు అరవింద్ హీరో విజయ్ దేవరకొండ రకుల్ ప్రీత్ సింగ్ తదితర ప్రముఖులు పాల్గొన విషయం తెలిసిందే.

అదేవిధంగా సమంత యాడ్ ప్రమోషన్ల భాగంగా మంచి హాట్ షూట్ ఫొటోలోతో అభిమానులకు మత్తెక్కిస్తోంది. అయితే ఇటీవలే ఎయిర్ పోర్ట్ నుండి బయటకు వస్తున్న సమంత ఎల్లో మిడ్‌టాప్, డెనిమ్ జాకెట్, లేదర్ హ్యాండ్ బ్యాగ్, ట్రావెల్ బ్యాగ్‌తో డిఫరెంట్ లుక్ లో ఉండడంతో స్థానికులు ఫోటో క్లిక్ మనిపించారు.

ఆ ఫోటోలో ఉన్న సమంత హ్యాండ్ బ్యాక్ కి సుమారు 2లక్షలకు పైగానే ఉంటుందని సమాచారం. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఫన్నీ గా కామెంట్లు చేస్తున్నారు. అత్తారింటికి దారేది సినిమాలో సమంత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి కొట్టే డైలాగ్ ను అభిమానులు “సమంత బ్యాగ్ ఒకటి కొటేస్తే..చాలు.. మీ లైఫ్ సెటిల్ అయినటే” అన్ని ఫన్నీ గా కామెంట్ చేస్తున్నారు.