Samantha first Reality show after Divorce : విడాకుల తర్వాత సమంత చేసిన మొట్టమొదటి రియాలిటీ షో :-

Samantha first Reality show after Divorce : అవును మీరు చదివింది నిజమే. అక్టోబర్ 2 న సోషల్ మీడియాలో చైతన్య మరియు సమంత విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. ఈ విషయం గ్రహించిన అభిమానులు బాధతో ట్విట్టర్ లో సమంత ని , నాగ చైతన్య ని విడిపోకండి అని బాధపడుతూ ట్వీట్లు పెడుతున్న విషయం అందరికి తెలిసిందే.
అయితే విడాకులు తీసుకున్న 5 వ రోజే ఒక ప్రముఖ రియాలిటీ షో లో పాల్గొని అలరించేందుకు సిద్ధం అయింది సమంత. ఆ రియాలిటీ షో మరేదో కాదు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసే ఎవరు మీలో కోటీశ్వరులు.
ఈ షో లో సమంత పాల్గొని , 25 లక్షలు గెలుచుకుంది తెలిసింది. అయితే ఈ షో కి వచ్చే సెలబ్రిటీస్ అందరు సోషల్ సర్వీస్ కోసం ఆడుతారని తెలిసిందే. సమంత కూడా అలాగే ఆడి 25 లక్షలు గెలుచుకుంది కానీ ఈ ఎపిసోడ్ ఇప్పట్లో టెలికాస్ట్ అవ్వదు, ఎందుకంటే దీనికంటే ముందు మహేష్ బాబు ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ చేయవలసి ఉంది.
కానీ సమంత ఈ షో లో ఇలాంటి సమయం లో వచ్చి పాల్గొనడం ఒక రకంగా పాజిటివ్ వైబ్ ఏ అయినా, కొంతమంది నెటిజనులు దీనిపై నెగటివిటీ వెదజల్లుతున్నారు. ఎలాగో సమంత నెగటివిటీ ని పట్టించుకోదు కానీ ఇలా విడాకులు తీసుకొని భర్తతో విడిపోయాను అనే బాధతో ఉండకుండా ఇలా వరుస పనులతో బిజీ అవ్వడం మంచిదే. దీనితోపాటు త్వరలో సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదల కానుంది.