Samantha Filed Case on Youtube and TV Channels : కోర్ట్ మెట్లెక్కిన సమంత :-

Samantha Filed Case on Youtube and TV Channels : సమంత మరియు నాగచైతన్య వారు భార్య భర్తలుగా విడిపోతున్నాం అని సోషల్ మీడియా లో అధికారికంగా ప్రకటించినప్పటినుంచి సోషల్ మీడియా లో సమంత మీద చాల అంటే చాల నెగటివిటీ గా ప్రాజెక్ట్ చేయడం జరిగింది , జరుగుతుంది కూడా.
సెలబ్రిటీస్ మీద ఎలాంటి విషయం లోనైనా ఫన్నీ వే లో కామెంట్ చేయచ్చు , వీడియోస్ చేసుకోవచ్చు కానీ పర్సనల్ లైఫ్ లో ఎం జరిగిందో తెలియకుండా కించపరిచేలా ప్రాజెక్ట్ చేస్తే ఎవరు ఊరుకోరు.
అయితే మ్యాటర్ లోకి వెళ్తే సమంత మరియు నాగ చైతన్య మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయో ఎవరికీ తెలియదు. వారు ఎందుకు విడిపోయారో ఎవరికి తెలియదు. అసలు వాలు విడిపోవడానికి గల కారణాలు కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ జంట ఏ ఒక్క దానికి జవాబు ఇయ్యకుండా విడిపోతున్నాం అని ప్రకటించారు కనుక.
వారు జవాబు కచ్చితంగా ఇయాలని ఎక్కడ రూల్ లేదు ఎందుకంటే అది వాలా పర్సనల్ లైఫ్. కాకపోతే చాల యూట్యూబ్ చానెల్స్ మరియు టీవీ చానెల్స్ సమంత క్యారెక్టర్ ని నెగటివ్ గా ప్రాజెక్ట్ చేస్తూ , వారి దాంపత్య వివాహం పై మరియు విడిపోవడానికి గల కారణాలు ఎవరికీ వారు సొంతంగా ఊహించుకుంటూ కల్పితమైన కధలు సృష్టిస్తూ రోజుకొక కొత్త కథనాలతో సమంత మీద నెగటివ్ ప్రొజెక్షన్ జరుగుతూ వచ్చింది.
అయితే ఈరోజు సమంత ఈ నెగటివ్ ఇంపాక్ట్ తట్టుకోలేక డైరెక్ట్ గా కోర్టు మెట్లు ఎక్కిందని సమాచారం. సమంత యూట్యూబ్ చానెల్స్ మీద మరియు టీవీ చానెల్స్ మీద కేసు ఫైల్ చేసింది. ఈరోజు నుంచి ఈ కేసు పైన హియరింగ్ జరగబోతుంది. ఈ చానెల్స్ వారు సమంత క్యారెక్టర్ మీద నెగటివ్ చూపిస్తున్నట్లు కేసు పెట్టడం జరిగింది.
దానికి తోడు సమంత క్యారెక్టర్ మీద ఇన్నిరోజులు నెగటివ్ గా ప్రచారం చేసిన వీడియోలు అన్ని డిలీట్ చేయాలనీ ఆదేశం ఇచ్చింది. ఇపుడైనా సొంతంగా కలిపించి కధనాలు అల్లడం మానేసి నిజ నిజాలు తెలుసుకొని ఒకరి మీద టీవీ లో కానీ యూట్యూబ్ లోని చానెల్స్ లో కానీ పెడితే బాగుంటుంది.
చూడాలి మరి కోర్ట్ కేసు ద్వారా సమంత సోషల్ మీడియా లో ఎలాంటి మార్పులు తీసుకొని రాబోతుందో.