Today Telugu News Updates
Salman Khan: ఆమె కోసం ఎక్కి ఎక్కి ఏడ్చిన హీరో సల్మాన్ ఖాన్
బాలీవుడ్లో అగ్రహీరో, కండర వీరుడు, నిర్మాత, సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హోస్ట్ గా అదరగొడుతున్న విషయం తెలిసిందే. వీకెండ్ వస్తే చాలు ఎంటర్టైన్మెంట్ తో పాటు తప్పు చేస్తే సల్మాన్ కంటెస్టెంట్ల తాట తీసేవాడు. కానీ ఈ ఆదివారం సల్మాన్ ఖాన్ భావోద్వేగానికి గురై ఏడ్చేశాడు. ఎందుకో తెలుసా?

ఎప్పటి వారంలాగానే ఈ ఆదివారం ఎలిమినేషన్ ప్రాసెస్ లో భాగంగా ఒక కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయాల్సి ఉంది. ఈ మేరకు లాస్ట్ లో జాస్మిన్ భాసిన్, అభినవ్ శుక్లా ఉండగా సల్మాన్ భావోద్వేగానికి గురై ఐ యాం సారీ జాస్మిన్ అంటూ ఏడ్చేశాడు. సల్మాన్ కి జాస్మిన్ పై ప్రత్యేక చొరవ చూపుతుండేవారు. అందుకే కావచ్చు సల్మాన్ కంట తడి పెట్టాడు.