Salaar Teaser Vs Jawaan Prevue : ప్రభాస్-షారుక్ ఖాన్ ఎవరు తోపు?
Salaar Teaser Vs Jawaan Prevue : ప్రభాస్.. ది మోస్ట్ పాపులర్ హీరో.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్.. ఆ సినిమా తర్వాత వరుసగా మూడు ఫ్లాప్ లు చవిచూడాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దుమ్ము దులిపిన బాహుబలి సినిమా తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ మూవీ టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్ గా నిలవడం విశేషం.

అలాగే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ జవాన్ ప్రివ్యూ విడుదలైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీంతో జవాన్ సలార్ మధ్య పోటీ ఉంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్విట్టర్లో ప్రభాస్ షారుఖ్ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్ జరుగుతోంది. అయితే కొందరు యూట్యూబర్ లు సలార్ టీజర్ జవాన్ ప్రివ్యూ లో ఏది బాగుందని కాంపేర్ చేస్తున్నరు. జవాన్ ప్రివ్యూ లో నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొనే కనబడ్డారు. అందులో షారుక్ ఖాన్ డయల్ రోల్ చేస్తున్నట్టు కనిపించిన.. కానీ పూర్తిగా క్లారిటీ ఎవరికి రాలేదు. లాస్ట్ లో షారుఖ్ గుండు లుక్ అంతగా ప్రేక్షకులకు డిఫరెంట్ గా అనిపించలేదు. అదేవిధంగా సలార్ టీజర్ చూస్తే పవర్ ఫుల్ డైలాగ్ తో ప్రభాస్ ఎంట్రీ అందరిని ఆకట్టుకుందని చెప్పాలి. ఈ రెండిటిని కంపేర్ చేస్తే.. ప్రభాస్ సలర్ టీజరే బాగుందని మెజార్టీ ప్రజలు ఆడియెన్స్ తెలుపుతున్నారు..
