Tollywood news in telugu

సైనా నెహ్వాల్ బయోపిక్ టీజర్ రిలీజ్ …ఈ మూవీకోసం 10 కేజీ ల బరువు తగ్గిన పరిణితిచోప్రా …!

saina teaser

Saina Movie Teaser: టాలీవడ్ , బాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతీ సినీ ఇండస్ట్రీలో ఇటీవల ప్రముఖుల బయోపిక్ ల ఆధారంగా సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు.  మొన్న వచ్చిన సూర్య సినిమా ‘ఆకాశమే నీ హద్దురా ‘ అనే మూవీ  ప్రముఖ ఎయిర్‌ దక్కన్‌ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్‌ ‘గోపీనాథ్’‌  జీవిత లోని అంశాలను  ఆధారంగా  సినిమాను తీసుకొచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని ఆస్కార్ బరిలో కూడా నిలిచిన విషయం మన అందరికి తెలిసిందే.

అలాగే, ధోని లాంటి ప్రముఖ క్రికెటర్ జీవితానికి సంబందించిన సినిమా కూడా వచ్చింది. ఇపుడు  బ్యాడ్మింటన్ లో తొలి ఒలంపిక్ పతకం పొందిన, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి’ సైనా నెహ్వాల్’ జీవిత కథ ఆధారంగా ‘ సైనా’ అనే మూవీ ని  నిర్మిస్తున్నారు. ఇందులో సైనా పాత్రలో  బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా నటిస్తున్నారు. ఇపుడు  తాజాగా ఈ సినిమా యొక్క  టీజర్ ను రిలీజ్ చేసారు. అదేవిదంగా ఈ మర్చి 26 న ప్రేక్షకులను అలరించనుంది.

Read  వీరిని నమ్మితే చావుకు దగ్గరైనట్టే
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button