SaiDharamTej – సాయి ధరంతేజ్ కి షాక్ ఇచ్చిన ఆర్. నారాయణ

“పిల్లా నువ్వు లేని జీవితం” సినిమాతో మొదలు పెట్టి “పండుగ చేసుకో” వంటి సక్సెస్ సినిమాలతో దూసుకెళ్తున్న సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్.. ప్రస్తుతం “సోలో బ్రతుకే సో బెటర్” సినిమాతో అలరించడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

తాజాగా ఒక్క నిమిషం 54 సెకండ్ల ట్రైలర్ ను చిత్ర బృందం యూట్యూబ్ లో విడుదల చేసింది… ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ బ్యాచ్లర్ లైఫ్ బెటర్ అనే ప్రత్యేక యువకుడి పాత్రలో విధించడంతో …ఈ ట్రైలర్ కి 5 గంటలోనే 1.2 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి…
ఈ చిత్రాన్ని సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సినీ చిత్ర బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.. ఈ చిత్రానికి బి.వి.స్.న్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ట్రైలర్ స్టార్టింగ్ లొనే హీరో సాయి ధరమ్ కటౌట్ ని కాలుస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తారు.. బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో సాయి ధరమ్ తేజ్ తన ఫ్లాష్ బ్యాక్ చెప్తూ.. “మన కన్స్టిట్యూషన్ మనకు స్వేచ్ఛగా బతకమని కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది..వాటిని మనం ఈ ప్రేమ పెళ్లి, అనే కమిట్మెంట్ రిలేషన్స్ తో నాశనం చేస్తున్నామని..We are Losing our Damn Rights” అని ఒక మైండ్ బ్లోయింగ్ డైలాగ్ చెప్తాడు.
ఆ తర్వాత హీరోకు మామ పాత్రలో నటిస్తున్న రావు రమేష్ “సినిమా హాల్లో మందుకు,సిగరెట్ లకు దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తారు కదా.. అలాగే పెళ్లికి పెళ్ళనికి కూడా దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలి కదా రా” అని సాయి ధరమ్ తేజ్ తో అంటాడు. ఈ ట్రైలర్ లో ఈ డైలాగే హైలెట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత తాను ఎంతగానో అభిమానించే ఆర్ నారాయణ ఒక ఇంటర్వ్యూలో ” మనిషి ప్రకృతి ధర్మం పాటించాలి..ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి.. పెళ్లి చేసుకోవాలి” అన్ని చెప్పడంతో హీరో షాక్ అయిపోతాడు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ కి జోడిగా నభా నటాషా నడిచింది. అలాగే వెన్నెల కిషోర్ తో పాటు రాజేంద్ర ప్రసాద్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్నిిి డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

