Sadaa : నాగబాబు కూతురి విడాకులపై సదా ఘాటు వ్యాఖ్యలు.. ఏమందంటే?
Sadaa: సదా… టాలీవుడ్లోకి జయం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగమ్మ….వెళ్లవయ్యా వెళ్లు వెళ్లూ అనే డైలాగ్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తరువాత అపరిచితుడు సినిమాలో విక్రమ్ కి జోడిగా నటించింది. ఆ సినిమా భారీ హిట్ అవ్వడంతో ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని అన్ని అందరు అనుకున్నారు. కానీ ఆమె సినీ కెరీర్ పట్టాలు తప్పింది. అయితే ఆమె సినిమాలో చిన్న పెద్ద క్యారెక్టర్ అన్ని తేడా లేకుండా… అడపాదడప అన్ని పాత్రలకు ఒకే చెప్పేది.. దీంతో ఆమె ప్రాధాన్యం లేని పాత్రలను కూడా ఎంచుకోవడంతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఇమేజ్ రాలేదు. సదా నటించిన టక్కరి నాగ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

అయితే ఈ అమ్మడికి మూడు పదుల వయసు దాటినా కూడా పెళ్లి చేసుకోవడం లేదు. పెళ్లెప్పుడు చేసుకుంటారు అని పలువురు ప్రశ్నించిన ఆమెదాన్ని దాటవేస్తూ వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటే ఫ్రీడం ఉండదు… ఉన్న ఫ్రీడమ్ కాస్త పోతుంది. మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి వస్తే లైఫ్ బాగుంటుంది. అలాగే ఇటివలే గ్రాండ్ గా పెళ్లిలు చేసుకున్నవారు సైతం విడాకులు తీసుకుంటున్నారు. అలా పెళ్లి చేసుకుని విడిపోవడం కన్నా ఇలా సింగల్ గా ఉండడమే బెటర్ అన్ని సదా తెలిపింది. అయితే గ్రాండ్ గా పెళ్లిలు చేసుకొని విడిపోవడం అనేది నిహారికని ఉద్దేశించే సదా చెప్పిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.