ఒక కుర్రాడి టాలెంట్ కి ఫిదా అయిన సచిన్.. వీడియో వైరల్…!

ఒక కుర్రాడి టాలెంట్‌కు మాజీ టీమిండియా క్రికెటర్ ఫిదా అయ్యాడు. ఆ కుర్రాడు కళ్లు మూసుకుని రూబిక్స్ క్యూబ్ ను కేవలం 16 సెకన్లలోనే సెట్ చేసి ఆశ్చర్య పరిచాడు. ఆ కుర్రాడు రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేస్తుండగా స్వయంగా సచిన్ వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలోకి వదిలాడు. ముంబైకి చెందిన మహ్మద్ అమన్ కొలీ గిన్నిస్‌బుక్ రికార్డుల్లో కూడా చోటు సంపాదించుకున్నాడు.
మహ్మద్ అమన్ కొలీ గురించి సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ… తనతో పాటు ఇక్కడ అమన్ కొలి అనే కుర్రాడు ఉన్నాడు , అతడికి ఇపుడు రూబిక్స్ క్యూబ్ ఇస్తానని చెప్పారు. అతడు దాని వైపు చూడకుండానే దాన్ని సాల్వ్ చేస్తాడని తెలిపారు. ఆ కుర్రాడు గిన్నిస్ బుక్ రికార్డులో కూడా చోటు దక్కించుకున్నాడని తెలిపాడు.
ఈ ఇండియన్ మన అందరినీ గర్వపడేలా చేశాడంటూ ప్రశంశలతో ముంచెత్తాడు. ఇక మనలని ఆ కుర్రాడిలా చేయమంటే కళ్లు తెరిచి చూస్తూ కూడా సరిగా చేయలేని పనిని అతడు చూడకుండానే చేశాడని తెలిపాడు. ఇప్పుడు ఈ కుర్రాడికి ఒక పెద్ద సవాలు ఉందని, అదేంటంటే తనకు కూడా రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం నేర్పించాల్సి ఉందని చమత్కారంగా అన్నారు.