movie reviews

సామి2 మూవీ రివ్యూ

నటీనటులు : చియాన్ విక్రమ్, కీర్తి సురేష్, బాబీ సింహ, ఐశ్వర్య రాజేష్,సూరి తదితరులు.

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

ఎడిటింగ్ : వెంకటేష్ అనుగురాజ్

సినిమాటోగ్రఫీ: వెంకటేష్ అంగురాజ్

దర్శకత్వం : హరి

నిర్మాత : శిబూ తమిన్స్

చియాన్ విక్రమ్, త్రిష హీరో హీరోయిన్లుగా 2003 లో వచ్చిన సామి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విక్రమ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా సీక్వెల్ తమిళంలో స్కేర్ టైటిల్ తో, తెలగులో saamy2 పేరుతో శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుంటుందో లేదో తెలియాలంటే సినిమా సమీక్షలోకి వెళ్లాల్సిందే.

కథ :

కథలోకి వెళ్తే మొదట వచ్చిన సామీ స్టోరీని బ్రీఫ్ గా చూపిస్తారు. పరుశురాం సామీ (విక్రమ్) భువన ( ఐశ్వర్య రాజేష్) భార్య భర్తలు. ఆ తరువాత స్టోరీ  28 సంవత్సరాలు ముందుకు జరుగుతుంది. హీరో రామ్ సామి ఢిల్లీలో (విక్రమ్) సివిల్స్ ఎగ్జామ్ రాసి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని రిజల్ట్స్ కోసం చూస్తూ సెంట్రల్ మినిస్టర్ అయిన నటుడు ప్రభు దగ్గర జాబ్ చేస్తుంటాడు. అప్పుడే ప్రభు కూతురైన కీర్తి సురేష్ తో ప్రేమలో పడతాడు. ఇంతలో రామ్ సామి తానూ ఆశించినట్టుగా ఐపీఎస్ పదవితో విజయవాడలో జాయిన్ అవుతాడు. అక్కడ రామ్ సామీకి తన తల్లితండ్రులను చంపిoది రావణ భిక్షు అనే రౌడి అని తెలుసుకొని రామ్ సామి తన తండ్రిని చంపిన రావణ భిక్షుపై ఎలా పగ తీర్చుకున్నాడు అనేది స్టోరీ.

విశ్లేషణ:

దర్శకుడు హరి సినిమాలో కొన్ని సన్నివేశాలను బాగా తెరకెక్కించారు. ఎంచుకున్న కథనాన్ని నడిపించడంలో ఎక్కడా తడబడకుండా చూసుకున్నారు. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అసలు విక్రమ్ ఒక్కరా ఇద్దరా అనే కన్ఫ్యూజన్ ని ఏర్పరచి ప్రేక్షకుల్లో సెకండ్ హాఫ్ ఫై ఆసక్తి పెంచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కాని దర్శకుడు ఎంచుకున్న కథలోనే లోపముంది. ఔట్ డేట్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈసినిమాలో రొటీన్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను బోర్ కొట్టించాడు దర్శకుడు.. సూరితో చేయించిన కామెడీ ప్రేక్షకుల్లో విసుగుని తెప్పిస్తుంది. హీరోయిన్ కీర్తి సురేష్ కి ఇందులో పెద్దగా ప్రాధాన్యం లేదు. మహానటి లాంటి చిత్రం తరువాత కీర్తి ఇలాంటి సినిమాని ఒప్పుకొని ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. సీక్వెల్ తీయడంలో దిట్టయినా దర్శకుడు హరి ఈ సారి పూర్తిగా విఫలమైనట్టు తెలుస్తుంది.

నటీనటులు:

విక్రమ్ ఒక  పవర్ ఫుల్ పోలీసు పాత్రలో, తన సిక్స్ ప్యాక్ బాడీతో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. ఈ వయసు లోకూడా ఆయన తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే తన పాత్రలో బాగా నటించాడు. ఇక కీర్తి సురేష్ కూడా బాగానే ఆకట్టుకుంది. విక్రమ్ తో వచ్చే ప్రేమ సన్నివేశాల్లో బాగా నటించింది. ఐశ్వర్య తన పాత్ర మేరకు నటించింది. ఇక విలన్ క్యారెక్టర్ లో బాబీ సింహా బాగా నటించాడు.

సాంకేతిక వర్గం :

దర్శకుడు హరి ఈ సారి ప్రేక్షకులను నిరాశపరిచాడు. కథ లేకుండా రొటీన్ సన్నివేశాలతో saamy 2 చాల వరకు నిరాశ పరిచింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం పర్వాలేదనిపించింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ప్రియన్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజయన్ ,జై ల ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపిస్తోంది. శిబూ తమీన్స్ నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

విక్రమ్ పెర్ఫార్మెన్స్

బాబీ సింహా విలనిజం

యాక్షన్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్:                                                     

రొటీన్ స్టోరీ

వయొలెన్స్ కాస్త ఎక్కువగా ఉండటం

కథలో కొత్తదనం లేక పోవడం

తీర్పు :

చివరిగా saamy2 చియాన్ విక్రమ్ పెర్ఫార్మన్స్ చూడాలనుకునే వారు మాత్రం ఈ సినిమాను చూడొచ్చు. ఈసినిమా ఓవరాల్ గా మాస్ ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పొచ్చు.

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button