devotional information

rules of shiv pooja in telugu hindu gods- శివాలయ దర్శన నియమాలు

rules of shiv pooja in telugu hindu gods

rules of shiv pooja in telugu hindu gods::

rules of shiv pooja in telugu hindu gods:: ఈరోజు పుష్య మాసంలోని రెండోరొజు విదియతో కూడియున్న సోమ వారం.

సోమ వారం కాబట్టివిశేషంగా ఈరోజు శివారాధన,చంద్ర గ్రహ దోషాలతో బాధపడే వారు శివాలయ దర్శనం చేయాలి.శివాలయంలో వారు కొన్ని నియమాలు పాటిస్తే శివానుగ్రహమ్ త్వరితగతిన పొందవచ్చు ఆనియమాల్లో కొన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.

శివాలయంలో కి వెళ్లడానికి తెలుపు వస్త్రాలు,వీలయితే సంప్రదాయ దుస్తులు ధరించి వెళ్లండి.ఆలయంలోకి ప్రవేశించే ముందు ఆయన వాహనం అయిన నంది యొక్క అనుమతి తీసుకుని మాత్రమే వెళ్లాలి అది నియమం.

విభూది ధారణ చేయాలి,ఉదయ దర్శనం అయితే తడి విభూతిని,సాయంకాలం అయితే పొడి విభూతిని ధరించాలి.స్త్రీలు సదా పొడి విభూదిని మాత్రమే ధరించాలి.ధరించగా మిగిలిన విభూది నేల మీద పారవెయరాదు.విభూదికి మరో పేరు ఐశ్వర్యం కాబట్టి దానికి అంత విలువ.

పురుషులు రుద్రాక్షలను మెడలో ధరించి ఆరాధన చేయడం మరింత శుభకరము.ఆలయంలో కనీసం ఒక గడియ కాలం తప్పనిసరిగా ఉండాలి.ముందుగా నవగ్రహ ప్రదక్షిణ చేయాలి.
(మరిన్ని నియమాలు రాబోయే కథనంలో)
ఓం నమశ్శివాయ

Tags

Related Articles

Leave a Reply

Back to top button
Close
Close