Rudrangi Review : రుద్రంగి మూవీ రివ్యూ…. సినిమా రేటింగ్?
Rudrangi Review : ప్రముఖ ఆర్టిస్ట్ జగపతిబాబు కీలక పాత్రలో నటించిన రుద్రంగి సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రాన్ని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించారు. ఇప్పటికే తెలంగాణ దొరల కథ అంశంతో ఒసేయ్ రాములమ్మ, సమ్మక్క సారక్క వంటి చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాలు కమర్షియల్ సినిమాలకు దీటుగా బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినిమాల్లో తెలంగాణ యాస,భాష, సాంస్కృతి అందరిని ఆకట్టుకుంటుంది. దీంతో దర్శక నిర్మాతలు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో కథలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు.

అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో వచ్చిన రుద్రంగి పూర్తిగా తెలంగాణ కథాంశంతో రూపొందిన చిత్రం.. ఈ మూవీ లో మల్లేష్,రుద్రంగి బావా మరదళ్లు.. అయితే వాళ్ళిద్దరి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో తాత దగ్గర పెరుగుతూ ఉంటారు. అయితే ఆ ఇద్దరికీ చిన్నప్పుడే ఆ తాత పెళ్లి చేస్తాడు. ఎప్పుడూ ఇలానే కలిసుండాలని వాళ్ళ దగ్గర మాట తీసుకుంటాడు. ఓ రోజు దొర(ప్రభాకర్) తాతని పొలం దున్నడానికని రమ్మంటే తాత రాకపోయేసరికి.. కోపంతో దొర కొట్టి చంపేస్తాడు. దీంతో మల్లేష్ ఆ దొరని రాయితో కొట్టి పారిపోతాడు.మరో పెద్ద దొర భీమ్‌రావ్ దేశ్‌ముఖ్(జగపతిబాబు)ని కాపాడి .. మల్లేష్ అయిన దగ్గరే పాలేరుగా పనిచేస్తూ ఉంటాడు.

మల్లేష్ తన తాతని చంపిన దొరని ఎలా పగబట్టి చంపుతాడో అనేది ఈ కథ ముఖ్య ఉద్దేశం. ఈ సినిమాలో దొరల అరాచకని కళ్ళకు కట్టినట్టు చూపించారు. అయితే ఈ సినిమాలో దర్శకుడు కాస్త కొత్తదనాన్ని ప్రజెంట్ చేశాడనే చెప్పాలి. ఈ సినిమాని దర్శకుడు కొన్ని అంశాలు రక్తి కట్టించేలా చిత్రీకరించాడు. అయితే ఈ సినిమాలో ఎమోషన్స్ ని సరిగ్గా దర్శకుడు క్యారీ చేయలేకపోయాడు. రుద్రంగి తన బావ మల్లేష్ అంటే ఎంత ఇష్టమో చెప్పే సీన్ ఈ మూవీలో హైలెట్ అని చెప్పాలి. అలాగే ఈ సినిమాలో కొన్నిచోట్ల బూతులు ఉన్న డైలాగులు కట్ చేయడంతో.. ఫీల్ మిస్ అయింది. ఓవరాల్ గా ఈ చిత్రం యావరేజ్ అని చెప్పవచ్చు. నిర్మొహమాటంగా ప్రతి ప్రేక్షకుడు ఒక్కసారి ఈ సినిమాని హాయిగా చూడొచ్చు.రేటింగ్ : 2.5