Tollywood news in telugu

RRR VS Pushpa :: రాజమౌళికి నిద్రలేకుండా చేస్తున్న క్రియేటివ్ డైరెక్టర్

RRR VS Pushpa :: ఇలాంటి హెడ్ లైన్ ఎక్కడైనా విన్నారా, ఎపుడైన చూశారా.. కానీ ప్రస్తుతం జరుగుతున్నా పరిస్థితులని చూస్తుంటే ఇదే నిజమేమో అని అనిపిస్తుంది. దినికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇంతకీ ఆ క్రియేటివ్ డైరెక్టర్ ఎవరో ఇప్పటికే మీ మైండ్ లో బల్బ్ వెలిగినట్లుంది. అయన మరెవరో కాదు క్రియేటివ్ జీనియస్ సుకుమార్.

అవును సుకుమార్ గారు రాజమౌళి ని భయబ్రాంతులకు చేస్తున్నారు. అదెలా అనుకుంటున్నారా.

ముందుగా రాజమౌళి గారి నుంచి మొదలపెడుదాం. రాజమౌళి తీసిన అని సినిమాలు ఒకదాని మించి ఇంకొకటి, దాని మించి ఇంకొకటి తీస్తున్నారు. హిట్లు , బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్స్ కొడుతూ తన స్థాయిని వరల్డ్ వైడ్ పెంచుకుంటూ పోయారు. మగధీర , ఈగ , మర్యాద రమణ , బాహుబలి ఇవన్నీ క్రమం తప్పకుండా రాజమౌళి సినిమాల మీద ప్రపంచమంతా ఎదురు చూసేలా తార స్థాయిలో కూర్చోబెట్టాయి.

ఇదిలా ఉండగా ప్రస్తుతం తాను తీస్తున్న ఆర్ ఆర్ ఆర్ మీదే అందరి కళ్ళు. అందరి మనసులో ఒకటే ఉంది. ఆర్ ఆర్ ఆర్ , బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా లేదా అని.. ఇదిలా ఉండగా.. కొద్దిసేపు సుకుమార్ గారి గురించి మాట్లాడుకుందాం.

సుకుమార్ క్రియేటివిటీ కి బ్రాండ్ అంబాసిడర్. అయన సినిమాలు మొదట్లో జనలా బుర్రకి ఎక్కేవి కావు, తెలుగులో ప్లాప్ అయినా హాలీవుడ్ లో నచ్చడంతో ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్న రోజులు ఉన్నాయి. తెలుగు ప్రజలు అయన సినిమాలని సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నారు
అనే ఆలోచనతో ఆయనే తన స్టైల్ మార్చుకొని రామ్ చరణ్ తో రంగస్థలం తీసి మాస్ అంటే ఇది రా అని అందరి నోర్లు మూయించేలా చేశారు.

క్లాసిక్ డైరెక్టర్ కాస్త ఊర మాస్ డైరెక్టర్ గా మారితే ఎలా ఉండబోతుందో అని శాంపిల్ తో ఇచ్చి పడేశారు. ఇపుడు ఈ క్రియేటివ్ డైరెక్టర్ అల్లు అర్జున్ తో పుష్ప తీస్తున్న విషయం మనందరికీ తెలిసింది. ఇపుడు అసలైన హెడ్ లైన్ దగరికి వద్దాం.

రాజమౌళి కి నిద్ర లేకుండా చేస్తున్న క్రియేటివ్ డైరెక్టర్ అది ఎలా అంటే ఇద్దరు పోటాపోటీగా సినిమాలు తీస్తున్నారు ఒక పక్క రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ఇంకోపక్క పుష్ప. ఈ రెండు సినిమాలు త్వరలో థియేటర్ లో హల్ చల్ చేయబోతున్నాయి.

ఇదిలా ఉండగా ప్రజలకి ఈ రెండిట్లో ఏ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చుపిస్తున్నారో మొదటి పాటకి వచ్చిన వ్యూస్ బట్టే అర్ధం అయిపోతుంది. ఆర్ ఆర్ ఆర్ మొదటి పాట దోస్తీ విడుదలయి 16 రోజులవుతోంది. ఇన్నిరోజులకి తెలుగు వెర్షన్ లో 2 మిలియన్ వ్యూస్ కూడా దాటలేదు. హిందీ లో మాత్రం 18 మిల్లియన్ వ్యూస్ వచ్చాయి. అయితే పుష్ప మొదటి పాట దాకో దాకో మేక విడుదలైన మూడు రోజులోనే 15 మిలియన్ వ్యూస్ మించి పరుగులు తీస్తుంది. హిందీ లో కూడా 7 మిలియన్ ప్లస్ ఉంది ఇప్పటికే.

ఇక్కడే ప్రజల అభిప్రాయాలూ అర్ధం అవుతుంది. ప్రజలు RRR కన్నా పుష్ప కోసమే ఎక్కువ ఎదురు చూస్తున్నారని అర్ధం అవుతుంది. ఆర్ ఆర్ ఆర్ కథ అందరికి తెలిసిందే. కొన్ని కల్పితాలు జోడించి యాక్షన్ సన్నివేశాలు ఉండచ్చు, మహా అయితే ప్రజలు పక్కన పెట్టేశారేమో. ఇటు చుస్తే పుష్ప పార్ట్ 1 అందులోనూ అల్లు అర్జున్ నెవెర్ బిఫోర్ లుక్ , మొదటి పాటకే భీభత్సమైన ఆదరణ వచ్చేసరికి హైప్ టాప్ లో ఉంది.

ఇదిలా ఉండగా ఒక్క పాటతోనే మనం ఒక నిర్ణయానికి రాలేము.. ఇంకా ఎన్నో టీజర్లు , పాటలు విడుదల అవ్వాల్సి ఉంది. అప్పట్లో పరిస్థితులు తారుమారవచ్చు. కానీ ప్రస్తుతం ప్రజలు దేనికోసం ఎక్కువ చూస్తున్నారనే విషయం పై మనం చర్చలు జరిపింది. చూడాలి మరి ఏది ఎలా ఉండబోతుందో..

Tags

One Comment

  1. ఆర్.ఆర్.ఆర్. దోస్తీ తెలుగు 3 వీడియోలు ఉన్నాయి యూట్యూబ్‌లో. మూడూ కలిపి 24 మిలియన్ views దాటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button