RRR Release Date 2021 Officially Announced : ఆర్.ఆర్.ఆర్ విడుదల తేదీ ఫిక్స్ :-

RRR Release Date 2021 : మొత్తానికి యావత్ ప్రపంచం అంత ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎపుడో విడుదల అవ్వాల్సిన ఆర్.ఆర్.ఆర్.సినిమా వాయిదాల మీద వాయిదా పడుతూ చివరికి విడుదల తేదీ ఖరారు చేసుకుంది.
మ్యాటర్ లోకి వెళ్తే రాజమౌళి గారి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరియు ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమా గురించి మేము చెప్తే చాల విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా గురించి తెలియని వారు ఉండరు.
రాంచరణ్ , ఎన్టీఆర్ , అలియా భట్ , శ్రేయ సరన్ , అజయ్ దేవగన్ ఇలా ఎందరో కలిసి నటించిన ప్యాన్ ఇండియా సినిమా ఆర్.ఆర్.ఆర్. ప్రపంచం లో ఎటువంటి సమస్యలు లేకుండా ఉనింటే అక్టోబర్ 2021 లోనే విడుదల అయేది.
కాకపోతే ముందుగానే కరోనా సమస్యలతో థియేటర్స్ లో 50 శాతం ఏ జనాభా ఉండాలన్న షరతులు ఉండటం దానికి తోడు ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్స్ లో టికెట్స్ ఇష్యూ ఇప్పటికి నడవడం, టికెట్ రేట్స్ చాల అంటే చాల తక్కువ ఉండటం వాళ్ళ ఈ సినిమా ససేమీరా పోస్ట్ పోన్ కి దారి తీసింది.
ఈ వార్త విన్న అభిమానులు చాలనే బాధపడ్డారు. కాకపోతే వాలా బాధని తట్టుకోలేక చిత్రబృందం ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ ఆర్.ఆర్.ఆర్ సినిమా జనవరి 7, 2022 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి సర్వం సిద్ధం అయింది.
అప్పటిలోగా థియేటర్స్ 100 శాతం జనాభా తో ఉంటుందని మరియు ఆంధ్రప్రదేశ్ టికెట్ రేట్స్ ఇష్యూ కూడా సాల్వ్ అవుతుంది అని చిత్రబృందం మాట్లాడుకొని ఈ తేదిని ఖరారు చేశారని తెలుస్తుంది.
ఏదేమైనా ఆర్.ఆర్.ఆర్. సినిమా విడుదల తేదీ ప్రకటించడంతో బాధలో ఉన్న అభిమానులు కాస్త ఆనందం లో మునిగి తేలుతున్నారు. చూడాలి మరి ఈసారి ఎటువంటి మార్పులు లేకుండా ఆర్.ఆర్.ఆర్ సినిమా అనుకున్న తేదీనే విడుదల అవ్వాలని కోరుకుందాం.