RRR కొమురంభీమ్ టీజర్…మన్నెం ముద్దుబిడ్డ, గోండు బెబ్బులి… ఎన్టీఆర్ ఉగ్రరూపం !

RRR komurambheem: NTR ఇమేజ్ ఏ మాత్రం తగ్గకుండా, రాజమౌళి RRR సినిమాలో కొమురంభీమ్ పాత్రను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ముందుగా రాంచరణ్ ఫస్ట్ టీజర్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, ఇపుడు ఎన్టీఆర్ టీజర్ కి రాంచరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.
తాజాగా అక్టోబర్ 22 న కొమురం భీమ్ జయంతి సందర్భంగా ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ను జక్కన్న రాజమౌళి విడుదల చేసారు. ”వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి..నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చను పాలు తాగిన మన్నెం ముద్దుబిడ్డ. డైలాగులతో కూడిన ఈ టీజర్ 1 నిమిషం 32 సెకనుల నిడివితో కూడి, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొనేవిదంగా ఉండడంతో ఈ సినిమా పై అంచనాలు బారి స్థాయిలో పెరిగాయి.
ఈ సినిమా 400 కోట్ల బారి బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఆదేవిందంగా ఇందులో కీలక పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. హీరోయిన్స్ గా ఒలివియా మెరిసి ,అలియా బట్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 80% షూటింగ్ పూర్తిచేసుకుంది. త్వరలోనే సినిమాను తెరపైకి తీసుకొస్తామని జక్కన్న తెలియజేసారు.