Rope Way in hyderabad : హైదరాబాద్లో రోప్ వే…ఎక్కడి నుండి ఎక్కడికి ఉండబోతుందో తెలుసా !

Rope Way in hyderabad : హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు , కాలుతీసి , మరోకాడ కలువేయలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టడానికి ఇపుడు తెలంగాణ సర్కారు రోప్ వే రవాణా సౌకర్యాన్ని తీసుకు రాబోతుంది.
హైదరాబాద్ లో మెట్రో సేవలు వచ్చినప్పటికీ రోడ్డుపై ట్రాఫిక్ మాత్రం అలాగే ఉంది. ఈ ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసి ఈ రోప్ వే ను తీసుకువస్తుంది.
ఈ రోప్ వే సౌకర్యాలు వివిధ దేశాల్లో విజయవంతంగా నడుస్తున్నాయి. ఇపుడు ఈ సౌకర్యాన్ని మన తెలంగాణాకి పరిచయం చేసే దిశగా యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఉమ్టా) ముందుకు వస్తుంది.
హైదరాబాద్ లోని 3 మార్గాల్లో నడిపేటందుకు నివేదికను రూపొందిస్తున్నారు. ఇక నివేదిక ప్రకారం మెట్రో లేని ప్రాంతాలలో 3 రూట్ లు కలిపి ఈ రోప్ వె 17km ఉండనుందని తెలుస్తుంది.