Viral news in telugu

roja kabaddi video : రోజా రాజకీయాల్లో ప్రతిపక్షనేతలతో కబడ్డీ ఆడటం చూశాం …..కానీ కాలేజ్ పిల్లలతో ఆడటం చూసారా… వైరల్ వీడియో…!

roja kabaddi video

roja kabaddi video : ధైర్యానికి మారుపేరు ఐన నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా నిజ జీవితం లో ఎంత హుషారుగా ఉంటారో అందరికి తెలిసిన విషయమే, ఈ మహిళా ఇపుడు రాజకీయాలను, కుటుంబాన్ని బ్యాలన్స్ చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. అలాగే ప్రముఖ టివి ప్రోగ్రాం జబర్దస్త్ లో కూడా తన టైం ని స్పెండ్ చేస్తూ , తన అభిమానులకు దగ్గరగానే ఉంటున్నారు.

తాజాగా రోజా  చిత్తూరు జిల్లా నిండ్రలో కబడ్డీ టోర్నీ ప్రారంభించి తన చిన్ననాటి రోజులను గుర్తుచేస్తుకుంటూ తాను కూడా, అక్కడున్న పిల్లలతో కబడ్డీ.. కబడ్డీ అంటూ ఎంతో ఉత్సాహంగా ఆటను ఆడి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు . తానూ  చీరలో ఉన్న కానీ కబడ్డీ ఆటను ఆడి తన వైపు వారికీ ఒక పాయింట్ ని తెచ్చిపెట్టారు.

రోజా గారు మాట్లాడుతూ తనకి గ్రామీణ ఆటల్లో కబడ్డీ అంటే ఎంతో ఇష్టమైన ఆట అని తెలిపారు. చిన్నపుడు ఎక్కువగా అబ్బాయిలు ఆడుతూ ఉంటె చాల ఉత్సాహంగా తిలకించేదాన్నని చెప్పుకొచ్చారు. అలాగే అక్కడ ఉన్నవారికి అల్ ది బెస్ట్ చెప్పి అక్కడినుండి వెళ్లిపోయారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button