Tollywood news in telugu
అందుకే హఠాత్తుగా సినిమాలకు దూరమయ్యా !

రిచా గంగోపాధ్యాయ్ ప్రభాస్ సరసన ఒక మెరుపు మెరిసి ఇపుడు కనిపించకుండా పోయింది. మోడల్ గా తన కెరియర్ని మొదలుపెట్టి మిస్ ఇండియా మిచిగన్ పీజన్ కిరీటాన్ని అందుకుంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లీడర్’ సినిమాలో నటించారు. తరవాత మిరపకాయ్, మిర్చి వంటి హిట్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
రిచా ఇండస్ట్రీలో బిజీ ఉన్న సమయంలోనే హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఇండస్ట్రీలో ఎంతకాలం వీలయితే అంతకాలం ఉండాలని భావిస్తారు. కానీ రిచా దీనికి బిన్నంగా ఆలోచింది మరో మార్గం వైపు వెళ్ళింది.
వివరాల్లోకి వెళ్తే…. రిచా కి ఎప్పటినుండో MBA చేయాలనే తన కోరికను నెరవేర్చుకోడానికి, వాషింగ్ టన్ యూనివర్సిటీ లో సీటు రావడంతో సినిమా కెరీర్ కి కొంత గ్యాప్ ఇచ్చి తన కోరికను నెరవేర్చుకున్నారట.
అదేసమయంలో తన క్లాస్ మెట్ జో లంజెల్లా తో ప్రేమలో పడి తనని పెళ్లికూడా చేసుకున్నారు.