RGV Shocking Tweets About Allu Arjun

RGV About Mega Family ఇటీవలే మెగా స్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే పుట్టిన రోజు వేడుకలకి అందరు వచ్చారు పవన్ కళ్యాణ్ తో సహా, కానీ అల్లు అర్జున్ రాకపోవడంతో అటు అభిమానుల్లోనూ ఇటు ప్రేక్షకులలో ఎదో తెలియని లోటు. అసలు బన్నీ ఎప్పుడు ఇలా చేయలేదు అని పలు సందేహాలు బయట వినిపిస్తున్నాయి. ఇదే టైం అనుకోని రంగం లో దిగాడు రామ్ గోపాల్ వర్మ..
ఎప్పటిలాగే ట్విట్టర్ లో తాను చెప్పాలనుకుంది నిర్మొహమాటంగా చెపేశాడు. అదేంటంటే అల్లు అర్జున్ కి చిరు పుట్టినరోజు వేడుకలకి రావాల్సిన అవసరం ఏంటి? అల్లుఅర్జున్ సెల్ఫ్ మేడ్ స్టార్. ఆయనే ఇపుడు ప్రజెంట్ మెగా స్టార్. కాబట్టి అయన పార్టీ కి మిగితా హీరోలు లాగా ( వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్ , వైష్ణవ తేజ్ , పవన్ కళ్యాణ్ , నాగబాబు , రామ్ చరణ్ ) ఎందుకు రావాలి.
వీళ్లంటే చిరు ఉన్నంతకాలం ఉంటారు. కానీ బన్నీ ఆలా కాదు అని అందరిని ట్యాగ్ చేసి వైరల్ అయ్యేలా చేశాడు ఆర్జివి.
అసలు అయన ఎందుకు ఆలా అన్నారో తెలియదు కానీ బన్నీ ఫంక్షన్ కి రాకపోవడం తో ఒక ఫ్యాన్ వార్ ఏ జరిగేలా చేశాడు ఆర్జివి. అల్లుఅర్జున్ ప్రస్తుతం ఆహ ఆఫీస్ ఓపెనింగ్ పనులలో మరియు పుష్ప పార్ట్ 1 షూటింగ్ త్వరగా అయిపోకొట్టాలి అనే ఆలోచనతోనే రాలేదు అని సామాన్యులు అనుకుంటున్నారు.
ఏదేమైనా రామ్ గోపాల్ వర్మ ఆలా ట్వీట్ చేయకూడదు అని అతన్ని అకౌంట్ ని అభిమానులు రిపోర్ట్ కొట్టడం మొదలు పెట్టారు. చూడాలి మరి ఎం జరగబోతుందో.