Tollywood news in telugu
RGV: హింసే పెట్టుబడి…”D కంపెనీ”

Rgv: కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో సంచలన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ముంబైతో పాటు యావత్ దేశాన్ని గడగడలాడించిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బయోగ్రఫీ ఆధారంగా “D” కంపెనీ అనే సినిమాను ఆర్జివి తెరకెక్కిస్తున్నాడు.

సినిమా టైటిల్ ప్రకటనతో అలజడి రేపిన వర్మ… తాజాగా టీజర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ టీజర్ ను గమనిస్తే పూర్తిగా ముంబై నేపథ్యంలో సినిమాను తెరకెక్కించినట్లుగా అర్థమవుతుంది.
దావూదీ కంపెనీ ఎలా ప్రారంభించాడు? ఎలా డాన్ అయ్యాడు? అనేది ఈ టీజర్లో వర్మ ప్రస్తావించారు.