telugu gods devotional information in telugu

శివుని అభిషేక ఫలితాలు

కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతివంతమైన మాసం.శివుడు అభిషేక ప్రియుడు కేవలం అభిషేకాల ద్వారా తృప్తి చెంది భక్తుల్ని అనుగ్రహిస్తాడు. అందుకే ఆయనికి ఆషుతోషుడు, భోళా శంకరుడు అని పేరు.

అందువల్లే రాక్షసులు సైతం ఆయన్ని సులభంగా ప్రసన్నం చేసుకున్నారు పురాణాల్లో. కలియుగం లో మానవులు కూడా శివుని లింగ రూపంలో అభిషేకాలతో ప్రసన్నం చేసుకోవచ్చు.ఒక్కో ద్రవ్యం ఒక్కో రకమయిన ఫలితం ఇస్తుంది. అందువల్ల మన అభీష్టం మేరకు ఆయా ద్రవ్యాలతో నమక చమకాలతో లేదా వీలుకాని పక్షం లో పంచాక్షరీ మంత్రంతో అభిషేకించ వచ్చు.

సంధ్యా సమయంలో లేదా ప్రదోష కాలంలో ఇటువంటి అభిషేకాలు మరింత మంచి ఫలితం ఇస్తాయి.

శుద్ధ జలం చేత మనఃశాంతి, చెరకు రసం చేత ధన వృద్ధి, ద్రాక్ష రసం చేత విజయ ప్రాప్తి , నువ్వుల నూనె చేత అపమృత్యు భయం, గరిక జలం చేత నష్ట ద్రవ్య పునర్ ప్రాప్తి , తేనె చేత మంచి వాక్కు , మామిడి పళ్ళ రసం చేత దీర్ఘకాలిక వ్యాధులు నయం , సువర్ణ జలం తో అఖండ లక్ష్మి ప్రాప్తి , అవు పాల చేత సకల సుఖ ప్రాప్తి మొదలైనవి కలుగుతాయి.
ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభో శంకర

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button