Reshoots for Most Eligible Bachelor : రీషూట్స్ తోనే కాలం గడిపేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్:-

Reshoots for Most Eligible Bachelor : అఖిల్ అక్కినేని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో లాక్ డౌన్ ముందు సంవత్సరం అనగా 2019 లో మొదలయిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. దాని తర్వాత షూటింగ్ ప్రారంభమైన సినిమాలు కూడా థియేటర్లోనో లేదా ఓటీటీ లోనో రిలీజ్ చేసి హిట్ కోటేస్తున్నారు. కానీ ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రం అటు షూటింగ్ పూర్తి చేసుకోక , ప్రొమోషన్స్ మొదలుపెట్టకుండా రీషూట్స్ తో కాలం గడిపేస్తున్నారు.
అఖిల్ ఏమో సురేందర్ రెడ్డి తో ఏజెంట్ అనే మూవీ కూడా ప్రారంభించారు . కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా మాత్రం రిషూట్స్ అంటూ టైం వేస్ట్ చేస్తున్నారు. ఈ మధ్యనే నిజ జీవిత జంట అయినా రాహుల్ మరియు చిన్మయి లా మధ్య కొత్త సన్నివేశాలు రాసుకొని చిత్రీకరిస్తున్నారు అని ప్రకటించారు.
ఇవి ఇలాగె కొనసాగితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కంటే ముందు ఏజెంట్ సినిమా రిలీజ్ అయెల ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే దసరా పండుగకి ఈ సినిమా విడుదలవ్వాలి లేదంటే ఇప్పట్లో ఈ సినిమా విదుదల కష్టమే.