Republic Movie Review And Rating – రిపబ్లిక్ రివ్యూ

Movie Review :- Republic (2021)
నటీనటులు :- సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) , రమ్య కృష్ణ (Ramya Krishna), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), జగపతి బాబు (Jagapathi babu)
నిర్మాతలు :- జే. భగవాన్, జే. పుల్లారావు. (J.Bagavan, Pulla rao)
సంగీత దర్శకుడు :- మని శర్మ (Mani sharma)
డైరెక్టర్ :- దేవ కట్ట (Deva Katta)
Sai Dharam Tej’s Republic Movie Review And Rating
Story :-
ఈ కథ చేపల చెరువులోని చేపల గురించి దర్శకుడు తన స్టైల్ లో వివరించే విధానం తో మొదలవుతుంది. తదుపరి పంజా అభిరాం చిన్నతనం గురించి చూపిస్తూ , అతనికి ఉన్న ఇంటలిజెన్స్ ను తెలిపే సన్నివేశాలు ఉండగా. ఇపుడు పెద్ద అయిన పంజా అభిరాం ( సాయి ధరమ్ తేజ్ ) ఇంట్రో తో ఎలక్షన్ లో జరిగిన రిగ్గింగ్ గురించి ప్రశ్నించగా ప్రభుత్వం ఎం చేయలేని స్థితిలో ఉంటుంది. అయితే అభి కి అమెరికాలో యమ్.ఐ.టీ. సీట్ వచ్చిన వదులుకొని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ప్రిపేర్ అయి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వగా కేంద్రప్రభుత్వం నియమించిన ఐఏఎస్ అధికారిగా పశ్చిమగోదావరి జిల్లాలోని తెళ్లురు లో కలెక్టర్ గా వస్తారు. కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్న అభిరాం గుణ అనే గుండా ని చంపడం తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. అసలు యమ్.ఐ.టీ. సీట్ వదులుకొని ఐఏఎస్ కి అభిరాం ఎందుకు ప్రిపేర్ అయ్యారు ? అభిరాం ఎదురుకున్న చేదు సంఘటనలు ఏంటి ? విశాఖవాణి గా రమ్యకృష్ణ ని అభిరాం ఎం చేయబోతున్నారు? తెల్లురు లోనే అభిరాం ఎందుకు ఛార్జ్ తీసుకున్నారు? ఆ ఊరిలోని రాజకీయలు ఏ విధంగా ఉన్నాయి ? కలెక్టర్ అభిరాం రాజకీయాలలో ఎలాంటి మార్పులని తీసుకొని రాగలిగారు ? వీటన్నింటికి మధ్య హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పాత్ర ఏంటి ? అభిరాం కి ఐశ్వర్య రాజేష్ మధ్య కనెక్షన్ ఏంటి ? చివరికి ఎం జరగబోతుంది? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే .
Positives 👍 :-
- సాయి ధరమ్ తేజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్. ఎప్పటికి గుర్తుండిపోయే పాత్ర చేశారు. ఐశ్వర్య రాజేష్ , జగపతి బాబు , రమ్య కృష్ణ పాత్రలు కూడా ఎక్కడ తగ్గలేదు. సాయి ధరమ్ తేజ్ కి సమానంగా ప్రేక్షకులని అలరిస్తూనే ఆలోచింపచేశారు.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
- దేవకట్ట మార్క్ దర్శకత్వం. కథ మరియు కథనం నడిపిన విధానం చాల బాగుంది.
- ముఖ్యంగా చివరి 30 నిముషాలు హార్డ్ హిట్టింగ్.
- సినిమాటోగ్రఫీ బాగుంది.
- ఎడిటింగ్ బాగుంది.
Negatives 👎 :-
- పాటలు పెద్దగా అలరించవు.
- నిడివి ఎక్కువ మరియు కాస్త స్లో గా ఉంటుంది.
ముగింపు :-
మొత్తానికి ” Republic ” అనే సినిమా సమాజం లో ఉన్న ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. సినిమా మొదటినుంచి దేవకట్ట గారు నడిపిన విధానం ప్రేక్షకులని అలరిస్తుంది. సాయి ధరమ్ తేజ్ నటన అందరిని అలరిస్తుంది. ఈ సినిమా లో తేజ్ నటన ఎప్పటికి గుర్తుండిపోతుంది. రమ్యకృష్ణ , జగపతి బాబు , ఐశ్వర్య రాజేష్ వారివారి బెస్ట్ ఇచ్చారు. కథ లో చాల దమ్ముంది. సమాజం లో ఉన్న ప్రతి ఒక్కరు చూసి తెలుసుకోవలసిన నిజాలు చాల ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తానికి రిపబ్లిక్ అనే సినిమా ప్రతిఒక్కరు తప్పక చూడవలసిన సినిమా. చివరి 30 నిముషాలు హార్డ్ హిట్టింగ్ అందరికి ఆలోచింపెలా చేస్తుంది. ఈ వారం కుటుంబం అంత కలిసి చూడవలసిన సినిమా.
Rating :- 3.5 /5