ప్రాణంగా చూసుకునే వారు దూరం ఐతే ఇలా చేయండి… అంటున్న రేణుదేశాయ్ !

రేణుదేశాయ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని, అదే సమయంలో పవన్ కళ్యాణ్ సరసన చేసిన బద్రీ సినిమా ద్వారా వీరి మనసులు ఒకటై, కాపురం సవ్యంగా సాగుతున్న టైం లో, కొన్ని కారణాల వల్ల పిల్లలు ఉన్నప్పటికీ వీరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. చివరకు దూరం అయిపోయి వేరే పెళ్లిళ్ల కూడా చేసుకున్నారు.
తరవాత తన జీవితంలో ఈ చేదు సంఘటనలను మరచిపోయి రేణు వేరే అతన్ని పెళ్లిచేసుకొని నటిగా,దర్శకురాలిగా రాణిస్తున్నారు.
ఇక ఈ విషయాలు పక్కనపెడితే, ఎపుడు షోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే రేణు తాజాగా ప్రేమ,పెళ్లి విషయాలపై తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకున్నారు.

మన ప్రాణం, జీవితం కంటే ఎవరు ఎక్కువకాదు, మనలని ప్రేమించినవారు లేదంటే పెళ్లిచేసుకున్నవారు దూరమయ్యారని బాధ పడకుండా వారివారి జీవితాల గురించి అలోచించి ముందుకు వెళ్ళాలి , అంతేకాని ఆత్మహత్యలు చేసుకోవడం, బాధపడుకుంటూ కూర్చుంటే ఇంకా డిప్రెషన్ లోకి వెళ్లి వారి జీవితాలను పాడుచేసుకుంటూ ఉంటారు.
ప్రేమించిన వారు దూరం ఐతే మీ కుటుంబసబ్యలతోను,ఫ్రెండ్స్ తోను ఎక్కువ సమయం గడిపితే మీ బాధలనుండి బయట పాడుతారు అని సలహా ఇచ్చారు.