Renu Desai: నన్ను అందరూ అదోలా చూస్తున్నారు…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి, దర్శకురాలు రేణు దేశాయ్ అభిమానుల పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

రేణు దేశాయ్ కి కరోనా పాజిటివ్ వచ్చిందని కొన్ని మీడియా ఛానెల్ లు ఫేక్ న్యూస్ రాయడంతో సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే రేణు దేశాయ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

దీంతో ఈ విషయంపై రేణు దేశాయ్ స్పందించారు. తనకు కరోనా రాలేదని.. అవన్నీ ఫేక్ న్యూస్ అని రేణు దేశాయ్ తెలిపింది. అలాగే నిన్నా ఓ ఫంక్షన్ కి వెళ్లిగా… అక్కడ సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ ను చూసి.. ఆ ఫంక్షన్ లో అందరూ నన్ను అదోలా చూశారని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు బాధ్యత ఉందని ఒకవేళ కరోనా వస్తే అందరికీ అధికారికంగా వెల్లడిస్తానని, అలాగే తాను ఏ కార్యక్రమానికి వెళ్లాను అన్ని రేణు దేశాయ్ అన్నారు. ఒక న్యూస్ ని రాసేటప్పుడు నిజమో, అబద్ధమో తెలుసుకొని రాయాలని.. కరోనా అంటే జోక్ కాదని రేణు దేశాయ్ మండిపడింది. అలాగే ఇలాంటి ఫేక్ న్యూస్ ని అభిమానులు నమ్మవద్దని.. ఏమైనా విషయాలు ఉంటే తానే అధికారికంగా ప్రకటిస్తామని రేణుదేశాయ్ తెలిపింది.