Release Date dilemma for tollywood two biggies : రిలీజ్ డేట్ కోసం ఇబ్బంది పడుతున్న రెండు పెద్ద సినిమాలు :-

Release Date dilemma for tollywood two biggies : అవును మీరు చదివింది నిజమే రిలీజ్ డేట్ కోసం ఇబ్బంది పడుతున్న రెండు పెద్ద సినిమాలు. ఈ మధ్య కాలంలో విడుదల అవ్వాల్సిన ఎన్నో సినిమాలు వరుసగా విడుదల తేదీలు ప్రకటిస్తున్నాయి. కరోనా పుణ్యమా అని షూటింగ్ పూర్తి చేసుకున్న పెద్ద సినిమాలు రిలీజ్ చేయకుండా వాయిదా వేసిన రోజులు ఉన్నాయి.
అలాంటి పెద్ద సినిమాలలో బాలయ్య బాబు అఖండ మరియు మాస్ మహారాజ రవితేజ ఖిలాడీ ఒకటి. ఈ రెండు సినిమాలకి సరైన విడుదల తేదీ దొరకక ఇబ్బంది పడుతున్నారు.
ఎందుకంటే ఈ సినిమాలకంటే ముందే ముందంచన ప్లాన్ వేసి షూటింగ్ అవ్వని పెద్ద సినిమాలు కూడా విడుదల తేదీ ప్రకటించేశారు. ఇంకా టైం ఉందిలే నిదానంగా ప్రకటించచు అనుకున్నారేమో ఇప్పుడు డేట్స్ దొరకక ఇబ్బంది పడుతున్నారు.
ఇన్నిరోజులు బాలయ్య అఖండ సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతుంది అన్నారు , నాని శ్యామ్ సింగరాయ్ సినిమా తప్పుకొని మరి అఖండ విడుదలకి దారి ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమా బృందం మరల అధికారికంగా డిసెంబర్ 24 న విడుదల అవ్వబోతుంది అని ప్రకటించేశారు.
ఇప్పుడు నవంబర్ మరియు డిసెంబర్ నెలలో దాదాపు అన్ని డేట్స్ లాక్ అయిపోయాయి. పెద్దన్న , ఎనిమి , మంచిరోజులొచ్చాయి , లక్ష్య , పుష్పక విమానం , గుడ్ లక్ శశి , అనుభవించు రాజా , రాజా విక్రమార్క , రౌడీ బాయ్స్ ఇలా పెద్ద సినిమాలు నవంబర్ లో విడుదల కాగా.
పుష్ప ది రైజ్ , శ్యామ్ సింగరాయ్ , గని , ఇలా ఎన్నో సినిమాలు డిసెంబర్ లో విడుదల తేదీ ప్రకటించేసి కూర్చున్నారు. ఇప్పుడు వీటి మధ్యలో అఖండ మరియు ఖిలాడీ ని ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనేది ఆశక్తి కరంగా మారింది. చూడాలి మరి ఈ రెండు చిత్రబృందాలు ఎం చేయబోతున్నారో.