News
guinness world records : ఒక యువకుడి అద్భుత ప్రతిభ… కూల్ డ్రింక్ బాటిల్ మూతలను ఓపెన్ చేయడంలో రికార్డ్ !

ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రభాకర్ రెడ్డి అనే యువకుడు అరుదైన రికార్డ్ ని తన సొంతం చేసుకున్నాడు. ఇతను ఏకంగా 68 కూల్ డ్రింక్ బాటిల్ మూతలను కేవలం ఒక నిమిషం లోనే తన నుదిటితో ఓపెన్ చేసి రికార్డ్ లకు ఎక్కాడు.
దీనికి సంబదించిన ఒక వీడియో వైరల్ కాగా ఆ వీడియోలో ఒక వ్యక్తి బాటిల్స్ ని అందిస్తూ ఉంటె, ప్రభాకర్ తన నొసటితో మూతలను తీయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇదే రికార్డుని ఇంతకముందు 2016లో పాకిస్తాన్ కి చెందిన మహమ్మద్ రషీద్ చేసాడు, కానీ ఇపుడు ప్రభాకర్, రషీద్ రికార్డును బద్దలు కొట్టి గిన్నీస్ అధికారుల మనసును గెలుచుకున్నాడు.