ఉన్నట్లుండి బరువు తగ్గుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..
Unexpected Weight Loss: ప్రస్తుత రోజుల్లో బరువు తగ్గాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఉదయం జిమ్‌లకు వెళ్లి కండలు కరిగించడం మనం చూస్తూనే ఉంటాం. అలాగే తిండి కూడా పూర్తిగా తగ్గించేసి బక్కచిక్కిపోయేందుకు నానా తంటాలు పడేవారు మరెందరో. అయితే కొందరు వారికి తెలియకుండానే బరువు తగ్గిపోతుంటారు. దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే..
ఉన్నట్టుండి బరువు తగ్గడం అనేది పోషకాహారలోపం వల్ల కానీ, శరీరంలో ఏదైనా వ్యాధి ముదరడం వల్ల కానీ జరగవచ్చు.

గుండె సంబంధ వ్యాధులతో బాధ పడేవారు కూడా యాదృచ్ఛికంగా తగ్గిపోతారు.
థైరాయిడ్ గ్రంధిలో మార్పులు వల్ల కొన్ని సార్లు బరువు పెరుగుతాం మరికొన్ని సందర్భాల్లో అకసాత్తుగా తగ్గిపోతాం. హైపర్ థైరాయిడిజమ్ ఉన్నవారిలో ఏకంగా బరువు పడిపోతున్నట్లు తేలింది.
6 నుంచి 12 నెలల సమయంలో శరీరం బరువు 5 శాతం కన్నా తగ్గినట్లయితే కచ్చితంగా వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం.