technology information
స్మార్ట్ వాచీలను విడుదల చేసిన రియల్ మీ….మరి ధర ఎంతో తెలుసా !

ప్రముఖ దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మీ , ఇపుడు స్మార్ట్ వాచీలను మార్కెట్ లోకి తీసుకు వచ్చింది. ఎస్ ప్రో, ఎస్ బ్రాండ్లతో మార్కెట్ లోకి వచ్చాయి. ఇందులో సర్య్కులర్ డిజైన్‌తోపాటు హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ లాంటి ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షించనుంది. వీటిని రియల్ మీ, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లతోపాటు, పలు స్టోర్లలలో వీటిని అందుబాటులో ఉంచారు.
ఇక వీటి ధర ఎస్ ప్రో వాచీ ధర రూ.9,999 కాగా.. ఎస్ వాచీ ధర రూ.4,999 నిర్ణయించింది. అలాగే మరొక ఎస్ మాస్టర్ ఎడిషన్ పేరుతో రాబోతున్న స్మార్ట్ వాచీ ధర రూ.5,999గా ఉండనుంది.
ఈ స్మార్ట్ వాచీలు బ్లాక్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్ కలర్స్‌లో లభించనున్నాయి. కాగా ఎస్ ప్రో వాచీలో 420 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండగా. రెండు గంటల్లో పూర్తి చార్జింగ్ అవుతుంది.