Raviteja 70 crazy lineup : రవితేజ క్రేజీ కాంబినేషన్ :-

Raviteja 70 crazy lineup : మాస్ మహారాజ రవితేజ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇండస్ట్రీ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మాస్ మహారాజ అనే గుర్తింపు పొందిన స్టార్ హీరో. మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా కంటెంట్ ని నమ్ముకొని తీసిన సినిమాలే. హిట్ అయినా ప్లాప్ అయినా అయన రూట్ ఏ సెపరేటు.
వరుస ప్లాప్స్ తో నిరాశ చెందిన రవితేజ కి క్రాక్ సినిమా మంచి బూస్ట్ అప్ ఇచ్చింది. క్రాక్ సినిమా ద్వారా మళ్ళీ మాస్ మహారాజ ఫార్మ్ లోకి వచ్చారు అనే విషయం లో ఎటువంటి సందేహం లేదు. అయితే రవి తేజ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ లైఫ్ ఫుల్ బిజీ బిజీ గా గడుపుతున్నారు.
ఖిలాడీ సినిమా షూటింగ్ పూర్తవడానికి రాగ , త్రినాధ్ రావు నక్కిన తో ధమాకా షూటింగ్ మొదలెట్టారు. దీనితోపాటు గవర్నమెంట్ ఎంప్లాయ్ గా రామారావు అనే సినిమా చేస్తున్నారు. ఇలా వరుసగా మూడు సినిమాలు ఒకేసారి చేస్తున్న రవితేజ. ఇంకా ఏవి షూటింగ్ పూర్తవక ముందే రవితేజ 70 వ సినిమా అనౌన్స్ చేసారు.
ఈ సినిమా ని డిఫరెంట్ మరియు థ్రిల్లర్ సినిమాలకి కేర్ అఫ్ అడ్రస్ అయినా సుధీర్ వర్మ దర్శకత్వంలో లో ఉండబోతుంది. అభిషేక్ పిక్చర్స్ అద్వర్యం లో అభిషేక్ నామ నిర్మించబోతున్నారు. కాన్సెప్ట్ సినిమాలు తీసే సుధీర్ వర్మ పోస్టర్ తోనే మరల ప్రేక్షకులని అలరించారు. హీరోస్ డోంట్ ఏక్సిస్ట్ అనే కాప్షన్ తో సినిమాకి కావాల్సిన హైప్ తెచ్చిపెట్టేసారు.
ఈ సినిమా కి సంబందించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ నవంబర్ 5 న ఉదయం 10:08 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. చూడాలి మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిలిం తో రాబోతున్నారో.