Rohit Sharma: 3వ టెస్టులో రోహిత్ శర్మ ఆడతాడా?లేదా? అనేది క్లారిటీ ఇచ్చిన ఇచ్చిన రవిశాస్త్రి
Rohit Sharma: 3వ టెస్టులో రోహిత్ శర్మ ఆడతాడా?లేదా? అనేది క్లారిటీ ఇచ్చిన ఇచ్చిన రవిశాస్త్రి: క్రికెట్ మ్యాచ్ లో అలవోకగా సెంచరీలు, డబల్ సెంచరీలు బదే ఏకైక ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ…తన నాయకత్వంలో 5 సార్లు ఐపీఎల్ టైటిల్ లు తీసుకువచ్చిన ఘనత రోహిత్ కే దక్కుతుంది. ఐపీఎల్ లో హిట్ మ్యాన్ గాయం కారణంగా.. నవంబరు 10 నుంచి ఇప్పటి వరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. ఇటీవలే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఫిట్ నెస్ టెస్ట్ లో రోహిత్ శర్మ పాస్ కావడంతో…సిడ్నీలోని ఓ డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌లో 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్నాడు

తాజాగా మెల్‌బోర్న్ వేదికగా మంగళవారం జరిగిన రెండో టెస్టులో 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ 1-1తో సమం అయింది..ఆదే విధానంగా జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగనుంది. 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ ఈ టెస్ట్ లో పాల్గొంటాడా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయంపై తాజాగా ఇండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. రోహిత్ 14 రోజులు పాటు ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా క్వారంటైన్ లో ఉన్నాడు కాబట్టి..అతనికి ఫిట్నెస్ టెస్ట్ పెట్టి..3వ టెస్ట్ లో ఆడిస్తామని రవిశాస్త్రి క్లారిటీ ఇచ్చాడు…
