Rashmika Slipper Shot Reply to Troll : తనదైన స్టైల్ లో ట్రోల్ కి రెస్పాండ్ అయినా రష్మిక :-

Rashmika Slipper Shot Reply to Troll : రష్మిక గురించి తెలియని వారు ఎవరు ఉంటారు. బాషా రాకపోయినా బేలగేడు అనే పాట వీడియో సాంగ్ చూసి , కన్నడలో తన కోసం కిరిక్ పార్టీ సినిమా చుసిన రోజులున్నాయి. ఈ సినిమా తెలుగు లో రీమేక్ చేసిన కూడా , అందరు కన్నడలో రష్మిక కోసమే చూసేవాళ్ళు ఎక్కువ అందుకే ఆ సాంగ్ కి 106 మిలియన్ ప్లస్ వ్యూస్ ఉన్నాయి.
అయితే దీని తర్వాత రష్మిక అన్ని భాషలోని సినిమాలలో నటించేందుకు అవకాశాలు వచ్చాయి. తెలుగులో కూడా ఇపుడు స్టార్ హీరోయిన్ అయిపొయింది. కాకపోతే తెలుగులో ఎపుడైతే రష్మిక సినిమాలు చేయడం మొదలుపెట్టిందో అప్పటినుంచి రష్మిక కి ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందొ , అలాగే ట్రోల్ చేసే వాళ్ళు కూడా అంతలా పెరిగిపోయారు.
ట్రోలింగ్ కొన్ని సార్లు కామెడీ గానే అనిపించినా ఎదో ఒక్క మూమెంట్ లో విసుగు, చిరాకు తెప్పిస్తాది అదే ఇప్పుడు రష్మిక విషయంలో జరిగింది.
మ్యాటర్ లోకి వెళ్తే రష్మిక ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో శర్వానంద్ తో చేసే ఆడవారు మీకు జోహార్లు అనే సినిమా ఒకటి. ఈ సినిమా గురించి టైటిల్ చుస్తేనే అర్ధం అవుతుంది. ఈ సినిమా దేనిపైనా ఉండబోతుందని.
అయితే దసరా పండుగ కానుకగా ఈ సినిమా పోస్టర్ విడుదల చేసారు. ఆ పోస్టర్ అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చింది. అయినా సరే ట్రోలింగ్ చేసేవాళ్ళు ఊరుకోరు గా పోస్టర్ లో రష్మిక ఫోటోని క్రాప్ చేసి సోషల్ మీడియా లో ఒకడు ” ఎలా తీసుకుంటున్నారు రా దీని ‘ అని అందరిని ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ చేసాడు.
ఈ ట్వీట్ ని రష్మిక తన స్టైల్ లో రిప్లై చేసింది. ఈ ట్వీట్ కి రష్మిక ” నా యాక్టింగ్ కోసం 😅🤣 ” అని స్లిప్పర్ షాట్ కామెంట్ చేసింది. దెబ్బకి ట్రోల్ మేకర్స్ షాక్ , రష్మిక ఫ్యాన్స్ ఈ కామెంట్ చూసి బాగాయింది అని సంతోషపడుతున్నారు. ట్రోలింగ్ కామన్ కానీ ఓవర్ ట్రోలింగ్ ఇలాగె ఉంటుంది , ఉండబోతుంది అని రష్మిక శాంపిల్ చూపించేసింది.