News
ఒక యువకుడిని బెదిరింపులకు గురిచేసిన ఎంఎల్ ఏ రసమయి బాలకిషన్ !

ఎంఎల్ ఏ రసమయి బాలకిషన్ మళ్ళీ వివాదాల్లో చిక్కుకున్నారు. బాలకిషన్ ఒక యువకుడిని తన అసభ్య పదజాలంతో బెదిరించిన తీరు, షోషల్ మీడియాలో, తెగ వైరల్ అవుతుంది.
ఒక యువకుడు బెజ్జంకి మండలం,బేగంపేట్ గ్రామ సమస్యను షోషల్ మీడియాలో పెట్టి స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రశ్నలు వేయగా, ఆ వీడియొ చూసిన రసమయి ఆ యువకుడిని ఇష్టమెచ్చినట్టు అసభ్య పదజాలంతో తిట్టడంతో ఆ ఆడియో ను రికార్డ్ చేసిన యువకుడు షోషల్ మీడియాలో పెట్టాడు.
గతంలో కూడా రసమయి కి మానకొండూర్ ఎన్నికల్లో ప్రజల నుండి నిరసనను ఎదుర్కొన్నాడు. ఐనకాని ఎన్నికల్లో విజయం తన పరం చేసుకున్నాడు.
కేవలం గ్రామ సమస్యను షోషల్ మీడియాలో పెట్టినందుకు ఇంతగా దూషించడం ఏంటని ప్రజలనుండి రసమయి కి వ్యతిరేకత ఏర్పడుతుంది.