Rangabali Review : నాగశౌర్య రంగబలి మూవీ ఎలా ఉందంటే?హిట్టు కొట్టినట్టేనా ?
Rangabali Review : నాగశౌర్య తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం పేరు.. వరుస ప్రేమ కథ చిత్రాలు చేస్తూ రొమాంటిక్ హీరోగా గుర్తింపు సంపాదించిన నాగశౌర్య… వైవిద్యమైన ప్రేమ కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. పవన్ భాసంశెట్టి దర్శకత్వంలో నాగశౌర్య కథానాయకుడిగా తెరకెక్కించిన రంగబలి చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలుత ఈ సినిమా టీజర్ ట్రైలర్ మంచి ఎంటర్టైనింగ్ గా ఉండడంతో ప్రేక్షకులు రంగబలిపై అంచనాలు పెట్టుకున్నారు. అయితే నేడు రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? సినిమా హిట్ ? ఫ్లాప్? ఈ సినిమాతో నాగశౌర్య మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కబోతున్నాడా?

ఇక సినిమా కథలోకి వస్తే శౌర్య కి తన సొంతూరు రాజవరం అంటే చాలా ఇష్టం.. అయితే ఈ శౌర్యకు ఏ పని చేసినా అందరూ తనని గుర్తించాలని షో చేసేవాడు.దీంతో ఆయనకు షో పేరు వచ్చింది. అయితే ఆ ఊర్లో రంగ బలి అనే సెంటర్ ఉండేది.. ఆ సెంటర్ కి శౌర్య ఇప్పుడు వెళ్లిన కింద పడిపోతూ ఉండేవాడు. అలాగే శౌర్య మెడికల్ కాలేజీలో ఓ అమ్మాయితో ప్రేమలో పడిపోతాడు. రంగ బలి సెంటర్ శౌర్య ప్రేమకు ఎలా అడ్డంకిగా మారుతుంది?రంగ బలి సెంటర్ కి శౌర్య కి మధ్య సంబంధం ఏంటి? అనేది ఈ సినిమా ముఖ్య కథాంశం.ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో రన్ అవుతుంది.

కథ పాతదైన ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి కామెడీ టైమింగ్ తో దర్శకుడు తెరకెక్కించాడు. అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సరదాగా ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ని మంచిగా రన్ చేసిన డైరెక్టర్.. సెకండ్ ట్రాక్ లో పట్టాలు తప్పినట్లు అనిపించింది. మంచిని విందాం, మంచిది చెప్పుకుందాం, చెడును కాకుండా మంచిని వ్యాప్తి చేద్దామంటూ ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు.. సినిమాలో పాటలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. రేటింగ్ 2.25..
