Rang De Movie Photos : నితిన్ ‘రంగ్ దే’ మూవీ వర్కింగ్ స్టిల్స్… వైరల్ ..

వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘రంగ్ దే’ ఇందులో హీరోగా నితిన్ , హీరోయిన్ గా కీర్తి సురేష్ లు నటిస్తున్నారు. ఇపుడు నితిన్ రెండు సినిమాల రిలీజ్ విషయం లో బిజిగా గడుపుతున్నాడు.

ఇపుడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొన్న సంక్రాంతికి విడుదల కావలసిన సినిమా కరోనా కారణంగా , విడుదల కాలేక పోయింది. ఇక ఈ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేసవిలో ప్రేక్షకులను కూల్ చేయడానికి వస్తుంది.

సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మొన్నటివరకు ఈ మూవీని ఓటీటీ వేదికగా రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారని పుకార్లు కూడా వచ్చాయి.

ఇపుడు తాజాగా ఈ చిత్రాన్ని మార్చి 26న థియేటర్లలో విడుదలకానుంది నిర్మాతలు వెల్లడించారు.

ఇప్పటికే ‘రంగ్ దే’ పోస్టర్, టీజర్లు విడుదలై సినిమాపై బారి అంచనాలను పెంచేసాయి.