Rana Turned as Singer : సింగర్ గా మారిన రానా :-

Rana Turned as Singer : అవును మీరు చదివింది నిజమే. రానా దగ్గుపాటి సింగర్ గా కొత్త అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు రానా ని హీరో గానే చుసిన జనాలు మరియు అతని అభిమానులు మొట్టమొదటి సారి రానా లోని గాయకుడిని చూడబోతున్నారు.
మ్యాటర్ లోకి వెళ్తే రానా దగ్గుపాటి వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవలే వెంకీ మామ తో వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారని అధికారికంగా ప్రకటించారు.
అయితే రానా లాక్ డౌన్ ముందు తీసిన సినిమా విరాట పర్వామ్. ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ ఇంకా పూర్తవలేదు. ఇంకా ప్యాచ్ వర్క్ ఉంది. దానికి సంబంధించిన షూటింగ్ ఈ వారం లో పూర్తిచేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. ఈ క్రమం లో విరాట పర్వమ్ దర్శకుడైన వేణు ఉడుగల కి ఒక ఆలోచన రావడం , ఆ ఆలోచనని రానాతో డిస్కస్ చేయడం, రానా అంగీకరించడం చక చక పూర్తయింది.
అయితే వేణు ఉడుగల గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ సినిమాలో రానా నక్సలైట్ గా కనిపిస్తుండగా రానా సిట్యుయేషనల్ సాంగ్ పాడాలని కోరగా రానా అంగీకరించారు.
ఈ పాటకి సంబందించిన ట్యూన్ వర్క్ కూడా పూర్తయింది. ఈ వారం లో రానా ఈ పాటనీ పాడబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇన్ని అప్ డేట్స్ వచ్చిన, రిలీజ్ డేట్ మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే పెట్టారు చిత్ర బృందం.
ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన టీజర్ , సాంగ్స్ , ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. ఇపుడు రానా పాడబోయే పాట కూడా అందరిని అలరిస్తుంది. చూడాలి మరి ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎపుడు చేయబోతున్నారో.