Rana loosing hopes on Virataparwam : రానా విరాటపర్వమ్ రిలీజ్ అవుతుందా ? :-

Rana loosing hopes on Virataparwam : రానా దగ్గుపాటి సినిమాలు చూడకుండా ఎవరైనా ఉంటారా. బాహుబలి తో ప్యాన్ ఇండియా లెవెల్ లో స్టార్డమ్ తెచ్చుకున్నారు రానా దగ్గుపాటి. తదుపరి సినిమాలు చాల సెలెక్టివ్ గా చేసి సక్సెస్ కొడుతున్నారు.
అయితే కరోనా మొదటి దశ తర్వాత రానా మల్టీ లాంగ్వేజ్ సినిమా అరణ్య విడుదలయింది. ఈ సినిమా తెలుగు లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న, మిగితా బాషలలో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
అయితే రానా , సాయి పల్లవి నటించిన విరాట పర్వము అనే సినిమా టీజర్ లు , పోస్టర్ లతో మంచి ఆదరణ పొందింది. శ్రీ విష్ణు నీది నది ఒకటే కథ అనే సినిమా దర్శకుడు వేణు ఉడుగల ఈ సినిమాని దర్శకత్వం వహించారు.
విరాట పర్వము సినిమా మంచి హైప్ క్రియేట్ అయింది. కానీ సినిమా మాత్రం విదుదల అవ్వకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇతర ఎన్నో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు విడుదల చేస్తున్న కూడా , ఎక్కడ ఈ సినిమా ప్రస్తావన రావడం లేదు.
రానా అభిమానులు ఈ సినిమా ఎపుడు రిలీజ్ అవుతుంది అని ట్విట్టర్ లో చిత్ర బృందాన్ని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. కానీ చిత్ర బృందం దీని పై ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు చూడాలి మరి ఈ సినిమా గురించి అధికారికంగా ఎపుడు ప్రకటిస్తారో.