Rana as Daniel Sekhar on his way : డానియెల్ శేఖర్ పవర్ ఏంటో తెలిసే రోజు వచ్చేసింది :-

Rana as Daniel Sekhar on his way : ఇప్పటికే మీకు మ్యాటర్ అర్ధం అయింటది. ఇన్నిరోజులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్ల నాయక్ గా పోస్టర్స్ మరియు టీజర్స్ దానికి తోడు టైటిల్ సాంగ్ వదిలారు. ఇది చూసి నెటిజనులు అందరు భీమ్లా నాయక్ మల్టీ స్టార్రర్ సినిమా కాదు ఓన్లీ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని ఇన్ డైరెక్ట్ గా చిత్ర బృందాన్ని తెప్పి పొడుస్తున్న విషయం అందరికి తెలిసిందే..
అయితే వీటికి సమాధానంగా చిత్ర బృందం అప్పుడే ఒక అంచనాకు రాకండి, ఇంకా చేయాల్సిన హంగామా చాల ఉంది. అన్ని పద్దతి ప్రకారం విడుదల అవుతూ వస్తాయి అని చెప్పారు. ఇపుడు అనుకున్న మాట నిలబెట్టుకున్నారు.
అదేంటంటే ఈనెల 20 న భీమ్లా నాయక్ కు పొట్టిగా నటిస్తున్న డానియెల్ శేఖర్ అలియాస్ రానా దగ్గుపాటి ఇంట్రో టీజర్ విడుదల చేయనున్నారు. ఇందులో రానా డానియెల్ శేఖర్ గా ఊరమస్ విలన్ గా కనిపించి ప్రేక్షకులని స్టైలిష్ విలన్ ని పరిచయం చేయనున్నారు.
రానా కూడా చాల ఆనందంతో ఉన్నాను 20 న డానియెల్ వరల్డ్ లో ఎంటర్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి అని తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. చూడాలి మరి రానా డానియెల్ శేఖర్ గా 20 న ఏ రేంజ్ హంగామా చేయనున్నారో.