Rana and Venky Mama in and as Rana Naidu : రానా, వెంకీ మామ వెబ్ సిరీస్ షురూ : రానా నాయుడు :-

Rana and Venky Mama in and as Rana Naidu :- రానా దగ్గుపాటి ఎప్పటినుంచో కన్నా కల ఇన్నాళ్లకు నెరవేరింది. రానా , వెంకీ మామ తో సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చేయాలనీ ఎప్పటినుంచో చెప్తున్నా మాటనే , మంచి కథ కావాలి అందుకోసం ఎదురుచూస్తున్నాము అని చెప్పారు.
ఇపుడు కథ దొరికేసిందన ఆనందం తో రానా ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించేశారు. నేను కన్నా కల నెరవేరేరోజు రానేవచ్చింది అని. నిజజీవితంలో వెంకీ మామ ని ఎంత అయితే ఇష్టపడుతానో , సిరీస్ లో అంతకు మించి ఒకరికొకరు కొట్టుకుంటాం అని అధికారికంగా చెప్పారు.
ఇదిలా ఉండగా ఈ సిరీస్ ని నెట్ ఫ్లిక్ లో విడుదల అని కూడా ప్రకటించేశారు. ఈ సిరీస్ ఒక అమెరికన్ వెబ్ సిరీస్ అయినా రే డొనోవన్ యొక్క రీమేక్ అని, కాకపోతే తెలుగు నేటివిటీ తగ్గట్టు మార్పులు జరిగాయి అని తెలిసింది.
ఈ సిరీస్ ని వయకం లిమిటెడ్ నిర్మిస్తుండగా కారన్ అన్షుమన్ మరియు సూపర్న్ వర్మ కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. చూడాలి మరి ఈ సిరీస్ లో వెంకీ మామ మరియు రానా ఏ రేంజ్ లో ప్రేక్షకులని అలరించబోతున్నారో. వర్కింగ్ పోస్టర్లో మాత్రం వెంకీ మామ లుక్ నెవెర్ బిఫోర్ నెవెర్ ఆఫ్టర్ రేంజ్ లో ఉంది.