Tollywood news in telugu

‘రొమాంటిక్’ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్న‌ ర‌మ్య‌కృష్ణ‌ !!!

‘రొమాంటిక్’ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్న‌ ర‌మ్య‌కృష్ణ‌

ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `రొమాంటిక్‌`. అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. `ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్ర‌మిది.
`బాహుబ‌లి` చిత్రంలో రాజ‌మాత శివ‌గామి న‌టించి సినీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇందులో ర‌మ్య‌కృష్ణ ఫుల్ లెంగ్త్ రోల్‌లో క‌న‌ప‌డ‌నున్నారు. మంగ‌ళ‌వారం నుండి జ‌రుగుతున్న షెడ్యూల్‌లో ర‌మ్య‌కృష్ణ జాయిన్ అయ్యారు. ఇన్‌టెన్స్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సునీల్ క‌శ్య‌ప్ సంగీతాన్ని అందిస్తున్నారు. న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

న‌టీన‌టులు:
ఆకాశ్ పూరి, కేతికాశ‌ర్మ‌, ర‌మ్య‌కృష్ణ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, ఉత్తేజ్‌, సునైన త‌దిత‌రులు

Read  మరో వివాదం లో ధోని

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  అనిల్ పాదూరి
నిర్మాత‌లు:  పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి
స‌మ‌ర్ప‌ణ‌:  లావ‌ణ్య‌
సంగీతం:  సునీల్ క‌శ్య‌ప్‌
సినిమాటోగ్ర‌ఫీ: న‌రేశ్
ఎడిట‌ర్‌:  జునైద్ సిద్ధిఖి
ఆర్ట్‌:  జానీ షేక్‌
పాట‌లు:  భాస్క‌ర భ‌ట్ల‌
ఫైట్స్‌:  రియ‌ల్ స‌తీశ్‌
పి.ఆర్‌.ఒ:  వంశీ శేఖ‌ర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button