Ramcharan Grand OTT Entry Soon : రాంచరణ్ డైరెక్ట్ ఓటీటీ ఫిలిం కి సర్వ సిద్ధం :-

Ramcharan Grand OTT Entry Soon : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలో తో బిజీ గా ఉన్నారు. ఇటీవలే చరణ్ ప్యాన్ ఇండియా సినిమా ముహూర్తం కూడా గ్రాండ్ గా జరిగింది. ఇలా వరుస సినిమాలతో బిజీ గా ఉన్నపటికీ చరణ్ ఒక నిర్ణయం తీసుకున్నారు.
అదేంటంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్మించే వెబ్ సిరీస్ లో చరణ్ నటించి కనువిందు చేయనున్నారు. మ్యాటర్ లోకి వస్తే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ పెద్ద, చిన్న సినిమాలు అని తేడా లేకుండా వరుసగా కొనుకొని ప్రజలకి ఎంటర్టైన్మెంట్ విషయం లో ఎటువంటి డోకా లేకుండా చేస్తుంది.
ఎన్నో పెద్ద సినిమాలు ఈ ప్లాట్ ఫార్మ్ లో విడుదయ్యాయి. అయితే ఈసారి హాట్ స్టార్ ఏ సొంతంగా ఒక వెబ్ సిరీస్ చేయనున్నారు అని టాక్. ఈ సిరీస్ కోసం రామ్ చరణ్ ని అడగగా , చరణ్ ఒప్పుకోవడం తో ఈ సిరీస్ కి సంబందించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనికి గాను చరణ్ 3 కోట్లు తీసుకున్నట్లు తెలిసింది.
ఈ సిరీస్ కి సంబంధించి మరిన్ని వివరాలు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బృందం త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. చూడాలి మరి రామ్ చరణ్ ని హాట్ స్టార్ వాలు ఎలాంటి సిరీస్ లో చుపియబోతున్నారో.