Tollywood news in telugu
నాతో తిరిగిన వాళ్ళు ప్రతి ఒకరు టెస్ట్ చేయించుకోండి…
Ramcharan Gets Corona Positive: రామ్ చరణ్ కి కరోనా పాజిటివ్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా వచ్చింది. ఈ మేరకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చినట్లు రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ప్రస్తుతం తనకు ఏ కరోనా లక్షణాలు లేవని ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపారు. తనతో గత కొద్ది రోజులుగా సన్నిహితంగా ఉన్నవారు కరోన టెస్ట్ చేయించుకుని.. క్వారంటైన్ లో ఉండాలని కోరారు. తాను త్వరలో పూర్తి ఆరోగ్యవంతంగా మరీ షూటింగ్లో పాల్గొంటానన్ని రామ్ చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
