Ramcharan Big Announcements Made Fans Go Crazy : రెండు భారీ సినిమాలు అనౌన్స్ చేసిన రాంచరణ్ :-

Ramcharan Big Announcements made fans Go Crazy : మెగా పవర్ స్టార్ రాంచరణ్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం చరణ్ ఎంతగానో ఎదురు చూసేది ప్యాన్ ఇండియా లెవెల్ లో విడుదలకు సిద్దమయిన ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమా జనవరి 7 న దేశవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారని అధికారికంగా ప్రకటన జరిగింది.
అయితే త్వరలో రాంచరణ్ , శంకర్ దర్శకత్వం లో జరగబోయే సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమాకి సంబందించిన పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగింది. రాంచరణ్ మరియు కైరా అద్వానీ మధ్య పాట చిత్రీకరణ తో ఈ సినిమా షూటింగ్ మొదలవబోతుంది.
ఇదిలా ఉండగా దసరా కానుకగా రాంచరణ్ , శంకర్ సినిమా తర్వాత చేయబోయే రెండు భారీ సినిమాల ప్రకటన జరిగింది. అందులో ఒకటి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో ఉండబోతుంది. ఈ సినిమాని యు.వి. క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించబోతున్నారు. గౌతమ్ దర్శకత్వం ఎలా ఉంటుందో అని డౌట్ ఏ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గౌతమ్ తీసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ ఏ.
అయితే రాంచరణ్ శంకర్ సినిమా పూర్తవగానే దీనిపై ఫోకస్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా కొద్దీ గంటల క్రితం ఎలివేషన్స్ కి కేర్ అఫ్ అడ్రస్ అయినా దర్శకుడు ప్రశాంత్ నీల్ తన సోషల్ మీడియా లో ఓ పోస్ట్ వేశారు.
అదేంటంటే ఒక లెజెండ్ ని కలిసాను ఇంకొకరిని మేకింగ్ కోసం కలిసాను అని ఇన్ డైరెక్ట్ గా మ్యాటర్ చెప్పారు. ఇదివరకే ప్రశాంత్ నీల్ , చిరు మరియు చరణ్ తో కలిసి డిస్కషన్ చేసుకున్నారని పోస్ట్ పెట్టారు. కాకపోతే చిరు మరియు చరణ్ కి కలిసి కథ చెప్పడం జరిగినట్లు ఉంది. త్వరలో రాంచరణ్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మరో ప్యాన్ ఇండియా సినిమా ఫిక్స్ చేసుకున్నట్లు అనిపిస్తుంది.
ఈ సినిమాని డి.వి.వి ఎంటర్టైన్మెంట్ నిర్మించబోతుందని తెలుస్తుంది. చూడాలి మరి చరణ్ ఏ రేంజ్ లో సినిమాలు ప్లాన్ చేస్తున్నారో. మొత్తానికి దసరా కానుకగా చరణ్ తీయబోయే రెండు సినిమాల అప్ డేట్స్ వచ్చాయి. ఒకటి డైరెక్ట్ గా, ఇంకొకటి ఇన్ డైరెక్ట్ గా. ఈ వార్త చరణ్ అభిమానులకి చాల ఆనందాన్ని ఇచ్చింది.