Tollywood news in telugu

ఎన్టీఆర్ రామచరణ్ బుక్

టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ అయినా రాజమౌళి తన తదుపరి చిత్రం త్రిబుల్ ఆర్ కి రామ్ చరణ్ ,ఎన్టీఆర్ లతో జత కట్టాడు.ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నప్పటి నుండే ఈ చిత్రంపై ఎన్నో రూమర్లు వచ్చేవి.ఈ చిత్రం షూటింగ్ ఇంకొన్ని రోజుల్లో మొదలవబోతోంది అనగా మళ్లీ తగ్గిన రూమర్లు ఊపందుకున్నాయి.

ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కు జోడీలు గా నటించబోతున్నట్లు చాలామంది హీరోయిన్ ల పేర్లు వినపడినా ఇంకా వీరిద్దరికీ జోడిగా ఎవరు నటించబోతున్నారు అన్న విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అయితే రాజమౌళి చిత్రం అంటే సంవత్సరాలు, సంవత్సరాలు నటించే వాళ్ళు వాళ్ళ డేట్స్ ని వదులుకోవాల్సి ఉంటుంది.

కానీ తాజాగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం అందుకున్న ఒక న్యూస్ ప్రకారం రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఈ చిత్రానికి పది నెలలు కేటాయిస్తూ సంతకం చేసినట్లు రాజమౌళి తన గత చిత్రాల లా కాకుండా దీన్ని త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button