Ram Gopal Varma : అమెరికాలో పుట్టిన మరో అల్లు అర్జున్.. ఆర్జీవే చెప్పేశాడు..!
Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ అలియాస్ ఆర్జివి.. ఈయన వివాదాలకు కేరాఫ్ అడ్రస్… తన సంచలమైన మాటలతో ఎప్పుడూ ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తన మాట దురుసుతోని కొన్ని కొన్ని సార్లు వివాదాలు కొని తెచ్చుకుంటారు. ఈయన ఏ దానిపై ఎలా స్పందిస్తాడో ఎవరు ఊహించలేరు. డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన స్పందిస్తూ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. అందరిలా ఆలోచించకుండా భిన్నమైన పర్సెప్షన్ తో ఆ ఇష్యుని అనలైజ్ చేస్తాడు. దీంతో చాలామంది ఆయనను ఫాలో అవుతూ ఉంటారు.

ఈయనకు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. కానీ ఆయన థాట్ ప్రాసెస్ అందరిని ఆలోచించేలా చేస్తుంది.మనిషిని పోలిన మనుషులు ఈ లోకంలో ఏడుగురు ఎక్కడో పుట్టి ఉంటారని మన పెద్దలు కొందరు చెప్తావుంటారు. అదేవిధంగా తాజాగా ఆర్జీవి కి కూడా అలానే ఒక మనిషిని చూస్తే అనిపించింది.

పూర్తిగా వివరాల్లోకి వెళితే యూఎస్ లో జరిగిన ఓ ఫంక్షన్ లో ఆర్జీవి పాల్గొనగా అందులో ఒక వ్యక్తి సేమ్ అల్లు అర్జున్ లాగా కనిపించాడు. అతని హెయిర్ స్టైల్, పర్సనాలిటీ సేమ్ టు సేమ్ అల్లు అర్జున్ లా ఉండడంతో ఆర్జివి అవాక్కయ్యాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.