Tollywood news in telugu

Ram establishes a monumental record with ‘Hello Guru Prema Kosame’

టాలీవుడ్ చాక్లెట్ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో రామ్ పోతినేని మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన రామ్ మాస్ లో సరికొత్త స్టైల్ ని ప్రజెంట్ చేశాడు. ఇక రామ్ కి నార్త్ ఆడియెన్స్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడుతున్నట్లు మరోసారి ఋజువయ్యింది.’ హలొ గురు ప్రేమ కోసమే ‘ హిందీలో ‘దుందార్ ఖిలాడీ’గా అనువాదమైన విషయం తెలిసిందే. 
యూ ట్యూబ్ లో ఈ సినిమా 140+ వ్యూస్ తో పాటు 1 మిలియన్ ప్లస్ లైక్స్ తో సరికొత్త రికార్డు సృష్టించింది. యూ ట్యూబ్ లో అతివేగంగా ఈ మైల్ స్టోన్ అందుకున్న ఏకైక  సౌత్ ఇండియన్ స్టార్ గా రామ్ ఈ సినిమాతో ట్రెండ్ సెట్ చేశాడు. రామ్ కి ఈ రికార్డులు కొత్తేమి కాదు. రామ్ కెరీర్ లో ఎన్నో వీడియో సాంగ్స్ యూ ట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి. అందులో ‘నేను శైలజ’ సాంగ్ 100మిలియన్ ల వ్యూస్ ని అందుకోగా, ఆ సినిమా హిందీ డబ్బింగ్ లో 140మిలియన్ల వ్యూస్ ని దాటేసింది. ‘ఉన్నది ఒకటే జిందగీ’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ‘నెంబర్ 1 దిల్ వాలా’ కూడా 1 మిలియన్ లైక్స్ కి అతి దగ్గరలో ఉంది. ‘ హైపర్ ‘ , ‘శివమ్’ సినిమాలు కూడా హిందీ ఆడియెన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి.   
ఇక ఇప్పుడు ‘హలో గురు ప్రేమ కోసమే ‘  సినిమా యూ ట్యూబ్ లో అత్యధిక లైకులు అందుకున్న సినిమాగా నిలిచింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా తెలుగులో పాజిటివ్ టాక్ ను అందుకుంది. రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్
 కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ఇక ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా అభిమానులను ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర  క్రియేషన్స్ బ్యానర్ లో ‘దిల్ ‘ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘హలో గురు ప్రేమకోసమే’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ఈ రేంజ్ లో రికార్డు సృష్టించింది అంటే ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ వస్తే మరిన్ని కొత్త రికార్డులతో యూ ట్యూబ్ దిమాక్ ఖరాబ్ కావాల్సిందే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button