Ram charan : బిడ్డ పుట్టడంతో ఉపాసనను బాధపెడుతున్న రామ్ చరణ్..అసలేం జరిగిందంటే?
Ram charan : రామ్ చరణ్.. తన తండ్రి నటన వారసత్వాన్ని ఒంట పట్టించుకోని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఉపాసనలకు ఇటీవల ఓ కుమారై జన్మించిన సంగతి తెలిసిందే. వారికి వివాహమైన పదేళ్లకు ఒక బిడ్డ పుట్టింది. దీంతో మెగా కుటుంబమంతా ఫుల్ ఖుషి లో ఉంది. ఈ నేపథ్యంలో సంబరాలు కూడా చేసుకున్నారు. అలాగే ఆ బుజ్జి పాపకు ‘క్లిన్ కార ‘ అని పేరు కూడా పెట్టారు.

ప్రస్తుతం ఉపాసన రామ్ చరణ్ లు ఆ బిడ్డతోనే ఆడుకుంటూ గడుపుతున్నారు.అయితే తాజాగా వారిద్దరికీ సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే మూడు నెలల వరకు బిడ్డ తోని ఉంటానని రామ్ చరణ్ ఉపాసనకు మాట ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే రామ్ చరణ్ మళ్లీ షూటింగ్లో పాల్గొనబోతున్నాడని.. చరణ్ మాట తప్పడని ఉపాసన బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… అయితే ఇందులో నిజం ఉందో లేదో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే..
