Ram Charan: ఆచార్య సెట్లోకి రామరాజు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “RRR” చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మేరకు నేడు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “ఆచార్య” సెట్ ని సందర్శించారు. కాసేపు డైరెక్టర్ కొరటాల శివ తో సరదాగా ముచ్చటించారు.

ఆచార్య చిత్రంలో కూడా రామ్ చరణ్ నటిస్తున్నాడని.. అది కూడా అతిధి పాత్రలో మాత్రమే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదు ఎందుకంటే …ఈ చిత్రంలో రామ్ చరణ్ వచ్చేది అతిధి పాత్రలో కాదట.. దర్శకుడు కొరటాల రామ్ చరణ్ కోసం 28 నిమిషాల పాటు ఉండే బలమైన పాత్రను సృష్టించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నారట. ఇప్పటికే వీరిరువురు మగధీర, బ్రూస్లీ, ఖైదీ నెం 150 సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది.

ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడిగా హీరోయిన్ రష్మిక మందన నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అదే విదంగా చరణ్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.