Tollywood news in telugu

Ram and Puri Cameo in Romantic Film : రామ్ రొమాంటిక్ గెస్ట్ రోల్ ?:-

Ram and Puri Cameo in Romantic Film

Ram and Puri Cameo in Romantic Film : హెడ్డింగ్ చదవగానే మీకు మ్యాటర్ అర్ధం అయింటది. అవును మీరు చదివింది నిజమే. ఇటీవలే హైదరాబాద్ లో ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమా ప్రివ్యూ షో వేయడం జరిగింది. అందులో భాగంగా చాల మంది ఫిలిం డైరెక్టర్స్ , సెలబ్రిటీస్ ఈ ప్రివ్యూ షో కి హాజరయ్యి సినిమా పై ఎన్నడూ లేని విధంగా హైప్ తీసుకొచ్చారు.

అయితే ఈ ప్రివ్యూ లో భాగంగా కొంతమంది మీడియా బృందం కూడా హాజరయినట్లు తెలుస్తుంది. మ్యాటర్ లోకి వెళ్తే ఆకాష్ పూరి రొమాంటిక్ సినిమా లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ స్పెషల్ అప్పీయరెన్స్ ఇయ్యబోతున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమా లోని రెండవ భాగం లో వచ్చే పీనే కె బాద్ అనే మాస్ పాటలో ఆకాష్ పూరి తో పాటు రామ్ కూడా డాన్స్ వేసి ప్రేక్షకులని అలరించబోతున్నారని తెలుస్తుంది. ఇక్కడ ఇంకో సప్రైజ్ ఏంటంటే ఈ సినిమాలో కూడా పూరి జగన్నాధ్ గారు స్పెషల్ రోల్ చేశారని అదెంటో సినిమా చూస్తేనే అర్ధం అవుతుంది అని ప్రివ్యూ చుసిన వారు చెప్పకనే చెప్పారు.

సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రామ్ , పూరి జగన్నాధ్ గారు , ఆకాష్ పూరి కలిసి పీనే కె బాద్ సాంగ్ లో చిందులేయ్యబోతున్నారు. ఈ సాంగ్ గోవా లో చిత్రీకరించారు.

చూడాలి మరి రామ్ , పూరి జగన్నాధ్ గారి స్పెషల్ అప్పీయరెన్స్ ఎలా ఉండబోతుందో , ఈ సినిమాలో వీరు కనిపించి అభిమానులని ఏ రేంజ్ లో ఉత్సాహ పరచబోతున్నారో మరి కొద్దీ గంటలో తెలిసిపోతుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button